Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Tirumala: టీటీడీ ఈవోగా బాధ్యతలు తీసుకున్న శ్యామలరావు..

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కొత్త ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌(ఈవో)గా ఐఏఎస్‌ అధికారి జె. శ్యామలరావు ఆదివారం(జూన్‌16) బాధత్యలు తీసుకున్నారు. సంప్రదాయం ప్రకారం ఆయన ముందుగా వరాహస్వామిని దర్శించుకుని అనంతరం శ్రీవారిని దర్శించుకున్నారు. టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి శ్యామలరావుకు ఛార్జ్‌ బాధ్యతలు అప్పగించారు. నూతన ఈవో దంపతులకు అర్చకులు ఆశీర్వదించారు. జేఈవోలు తీర్థప్రసాదాలు అందజేశారు.

సీఎం నారా చంద్రబాబు నాయుడు తిరుమల పర్యటన సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తిరుమలలో శాస్త్రం ప్రకారం ఉంటుందన్నారు. తిరుమలలో ఎలాంటి అపవిత్ర ఘటనలు చోటుచేసుకోకుండా చేస్తామని స్పష్టం చేశారు. ఈ క్రమంలో టీటీడీ ఈవోగా శ్యామల రావును నియమించారు. మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సోమవారం కూడా సెలవు కావడంతో ఆదివారం భక్తుల రద్దీ కనిపించింది.

Shyamala Rao took charge as TTD EO

స్వామివారి దర్శనానికి సమయం పడుతోంది. అటు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు జూన్ 17 నుంచి 21వ తేదీ వరకు ఐదు రోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నారు. ప్రతిరోజు సాయంత్రం 6.30 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు అమ్మవారు పద్మసరోవరంలో తెప్పలపై విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. ఈ ఉత్సవాల్లో శ్రీ అలమేలు మంగమ్మ పద్మసరోవర తీరంలో పాంచరాత్ర ఆగమపూజలు అందుకుని భక్తులను అనుగ్రహిస్తారు.

ప్రతి సంవత్సరం అమ్మవారికి జ్యేష్ఠశుద్ధ ఏకాదశి నుండి పౌర్ణమి వరకు రమణీయంగా తెప్పోత్సవాలు ఘనంగా చేస్తారు. తెప్పోత్సవాల్లో పాల్గొన్న భక్తులకు తిప్పలు, సంసార దుఃఖాలు తొలగి, మోక్షం సిద్ధిస్తుందన్నారు. పద్మసరస్సులో బంగారు పద్మం నుంచి ఆవిర్భవించిన అలమేలు మంగ జీవకోటికి మాతృమూర్తిగా మారి భవజలధిలో మునిగిపోకుండా రక్షించి, సర్వసౌఖ్యాలు ప్రసాదిస్తారని తెప్పోత్సవాల అంతరార్థమన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+