గెలుస్తా.. ఎందుకంటే: 4 కారణాలు చెప్పిన శిల్పా, 'ఆ తర్వాత పెనుమార్పులు'

ఉప ఎన్నికల్లో తాను కచ్చితంగా గెలుస్తానని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల ఉప ఎన్నిక అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి ఆదివారం అన్నారు. సోమవారం ఉదయం కౌంటింగ్ ప్రారంభం కానుంది.

నంద్యాల: ఉప ఎన్నికల్లో తాను కచ్చితంగా గెలుస్తానని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల ఉప ఎన్నిక అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి ఆదివారం అన్నారు. సోమవారం ఉదయం కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఆయన ఓ టీవీ ఛానల్‌తో మాట్లాడారు.

నా గెలుపుకు అవకాశాలు

నా గెలుపుకు అవకాశాలు

మూడు, నాలుగు పాయింట్ల ఆధారంగా తమ గెలుపుకు అవకాశాలు కనిపిస్తున్నాయని శిల్పా మోహన్ రెడ్డి చెప్పారు. తాను మంచి మెజార్టీతో గెలుస్తానని ఆయన అభిప్రాయపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత ఉందన్నారు.

ఈ నాలుగింటితో నేనే గెలుస్తా..

ఈ నాలుగింటితో నేనే గెలుస్తా..

నాలుగు పాయింట్ల ఆధారంగా తాను గెలుస్తానని చెప్పిన శిల్పా.. అవేమిటో కూడా చెప్పారు. ఒకటి జగన్ సమ్మోహనా శక్తి, అదే విధంగా వైసిపికి ప్రజల్లో ఉన్న బలం, మా (శిల్పా సోదరులు) వ్యక్తిగత బలం, ప్రభుత్వ వ్యతిరేకత. ఈ నాలుగు పాయింట్లను ఆధారంగా చేసుకుని పోలింగ్ సరళి పెరిగిందన్నారు.

Recommended Video

    Chandrababu Gave Promise to Bhuma Akhila Priya Over Nandyal MP
    నేను గెలుస్తా కానీ

    నేను గెలుస్తా కానీ

    నంద్యాలలో నేను గెలుస్తానని, అందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదని శిల్పా మోహన్ రెడ్డి చెప్పారు. అయితే, ఎంత మెజార్టీతో అనే విషయాన్ని తాను ఇప్పుడే చెప్పలేనని అన్నారు. కానీ మంచి మెజార్టీ వస్తుందని అభిప్రాయపడ్డారు.

    అఖిలప్రియ గెలుపు ఆశలు వీటిపై

    అఖిలప్రియ గెలుపు ఆశలు వీటిపై

    తన సోదరుడు భూమా బ్రహ్మానంద రెడ్డి గెలుపు ఖాయమని మంత్రి అఖిలప్రియ కూడా ధీమాగా ఉన్నారు. అభివృద్ధి పనులు, నంద్యాలలో తమకు ఉన్న బలం, తన తండ్రికి ఉన్న ఫాలోయింగ్, టిడిపి బలం గెలుపిస్తుందని భావిస్తున్నారు.

    నంద్యాల ఫలితం తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు

    నంద్యాల ఫలితం తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు

    ఉపఎన్నిక కౌంటింగ్ తర్వాత వైసిపిలో ఎవరూ మిగలరని మంత్రి ఆదినారాయణ రెడ్డి అభిప్రాయపడ్డారు. రేపు ఉదయం పది గంటల కల్లా తాము అనుకున్న మెజార్టీతో నంద్యాల ఉపఎన్నికలో గెలుపు ఖాయమన్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు వస్తాయన్నారు.

    లగడపాటి సర్వే నిజమవుతుందా?

    లగడపాటి సర్వే నిజమవుతుందా?

    నంద్యాల ఉప ఎన్నికల్లో మాజీ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ చెప్పిన సర్వే నిజమవుతుందా అనే చర్చ సాగుతోంది. గతంలో ఆయన చెప్పిన సర్వేలు ఒకింత అనుకూలంగా ఉన్నాయి. దీంతో ఆయన చెప్పినట్లు టిడిపి స్వల్ప మెజార్టీతో గట్టెక్కుతుందా అనేది చర్చనీయాంశంగా మారింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+