అఖిలకు చక్రపాణి రెడ్డి దెబ్బ, 3న వైసిపిలోకి: శిల్పా మోహన్ రెడ్డి చక్రం
ఉప ఎన్నికలకు ముందు టిడిపికి మరో షాక్ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. టిడిపి ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణి రెడ్డి ఆగస్ట్ 3వ తేదీన వైసిపిలో చేరనున్నారని ప్రచారం సాగుతోంది.
నంద్యాల: ఉప ఎన్నికలకు ముందు టిడిపికి మరో షాక్ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. టిడిపి ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణి రెడ్డి ఆగస్ట్ 3వ తేదీన వైసిపిలో చేరనున్నారని ప్రచారం సాగుతోంది.
భూమా నాగిరెడ్డి చేరిక మొదలు శిల్పా సోదరులు అసంతృప్తితో ఉన్నారు. ఎమ్మెల్సీగా చేసి శిల్పా సోదరులను చంద్రబాబు కూల్ చేశారు. అయితే, భూమా నాగిరెడ్డి మృతి, నంద్యాల ఉప ఎన్నికలతో మరోసారి చిక్కు వచ్చింది.

జగన్ సమక్షంలో వైసిపిలోకి చక్రపాణి రెడ్డి?
ఇప్పటికే శిల్పా మోహన్ రెడ్డి వైసిపిలో చేరి, నంద్యాల అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇప్పుడు శిల్పా చక్రపాణి రెడ్డి కూడా తన సోదరుడి దారిలోనే నడవనున్నారని చెబుతున్నారు. ఈ నెల 3న జగన్ నంద్యాలలో పర్యటించనున్నారు. ఆ సమయంలో చక్రపాణి వైసిపి తీర్థం పుచ్చుకోనున్నారని ప్రచారం సాగుతోంది.
Recommended Video


వైసిపిలో చేరుతున్నారా అని ప్రశ్నిస్తే..
మీరు ఆగస్ట్ నెల 3వ తేదీ వైసిపిలో చేరుతున్నారని ప్రచారం సాగుతుందని అడిగితే ఆయన సమాధానం చెప్పడం లేదని తెలుస్తోంది. అయితే, ఏదైనా విషయం ఉంటే తానే చెబుతానని మాత్రం శిల్పా చక్రపాణి రెడ్డి చెప్పారు. వైసిపిలో చేరుతున్నారనే వార్తలను మాత్రం ఖండించలేదు.

తమ్ముడి ఇంటికి రావడంపై మౌనం
శిల్పా మోహన్ రెడ్డి తన సోదరుడి ఇంటికి వచ్చి మద్దతు కోరారు. చక్రపాణి టిడిపిలో ఉన్నప్పటికీ మద్దతు కోరడం గమనార్హం. అయితే, ఆయన వచ్చింది కేవలం మద్దతు కోసమే కాదని, పూర్తిగా పార్టీ నుంచి తీసుకు వెళ్లడానికే వచ్చారని అంటున్నారు. ఈ విషయమై చర్చలు జరిగాయని చెబుతున్నారు. శిల్పా మోహన్ రెడ్డి ఇంటికి ఎందుకు వచ్చారంటే.. ఆయన మౌనం దాల్చారని తెలుస్తోంది. టిడిపిని వీడి వైసిపిలో చేరాలని శిల్పా చక్రపాణి రెడ్డిపై మోహన్ రెడ్డి ఒత్తిడి చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

చక్రపాణి రెడ్డి పార్టీ మారరని సోమిశెట్టి
శిల్పా చక్రపాణి రెడ్డి పార్టీ మారుతారనే ప్రచారం అంతా వట్టిదేనని టిడిపి జిల్లా నంద సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. తాను చక్రపాణి రెడ్డిని కలిశానని చెప్పారు. పార్టీ మారనని చెప్పారన్నారు. ఎల్లుండి భూమా బ్రహ్మానంద రెడ్డి నామినేషన్ వేసే సమయంలో చక్రపాణి రెడ్డి వస్తారని చెప్పారు. సోదరుడు కాబట్టి వచ్చి కలిశాడని, కానీ పార్టీ మారరని చెప్పారు.












Click it and Unblock the Notifications