విశాఖలో బేబీ సినిమా రిపీట్ .. చివర్లో అసలు ట్విస్ట్ అదే
బేబీ ..చిన్న సినిమాగా వచ్చి ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ముఖ్యంగా ఈ సినిమా యూత్‌కు బాగా కనెక్ట్ అయింది. అమ్మాయి ఒకేసారి ఇద్దరితో ప్రేమాయణం సాగిస్తుందనే పాయింట్‌తో సినిమా తెరకెక్కించారు. బేబీ సినిమా వాస్తవరూపానికి దగ్గరగా ఉండటంతో.. సినిమాను ప్రేక్షకులు పెద్ద హిట్ చేశారు. అచ్చం బేబీ సినిమాలో జరిగినట్టు నిజ జీవితంలో కూడా జరిగింది. ఈ ఘటన వైజాగ్‌లో చోటు చేసుకుంది. అయితే సినిమాలో హీరోయిన్ ప్రేమించి ఇద్దరిని కాదని చివరికి మరో వ్యక్తిని పెళ్లి చేసుకోవడంతో కథను సుఖంతం చేస్తే.. వాస్తవ ఘటనలో మాత్రం చివరకు విషాదాంతంగా మారింది. ఆ వివరాల్లోకి వెళ్తే..
విశాఖలో బేబీ సినిమా రిపీట్ pic.twitter.com/ySsOJ5YWyM
— oneindiatelugu (@oneindiatelugu) August 14, 2023
విశాఖపట్నంలో ఇంటర్ చదువుతున్న మైనర్ అమ్మాయి...ఒకే సమయంలో సాయికుమార్ , సూర్య ప్రకాష్ అనే ఇద్దరు యువకులతో ప్రేమాయణం సాగించింది. ఒకరికి తెలియకుండా మరొకరితో ప్రేమను నడిపింది. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏమిటంటే మైనర్ బాలిక సాయికుమార్‌తో రహస్యంగా తాళి కూడా కట్టించుకుంది. తాళి కట్టే సమయంలో వీడియో తీయడం జరిగింది. ఆ వీడియోలో నేనంటే నీకు ఇష్టమా అని సాయికుమార్ ఆ బాలికను అడగ్గా..ఆ మైనర్ బాలిక ఇష్టమే అని సమాధానం ఇచ్చింది. తాళి కట్టడం కూడా ఓకే అని చెప్పడం ఈ వీడియోలో కనిపించింది. సాయికుమార్‌ని పెళ్లి చేసుకున్న తరువాత కూడా మైనర్ బాలిక సూర్యప్రకాష్‌తో ప్రేమాయణం కొనసాగించింది.

మ్యాటర్ ప్రియులకు తెలియడంతో..సాయికుమార్, ప్రియుడు సూర్యప్రకాష్ ఆ బాలిక ఇంటికి వెళ్ళి మా ఇద్దరిలో ఎవరు కావాలో తేల్చుకో అంటూ నిలదీశారు.విషయం బయటకు రావడంతో మనస్థాపానికి గురైన మైనర్ బాలిక ఆత్మహత్య చేసుకుంది. "సూర్య.. వాళ్లు ఎవరినీ వదలకు, కుక్క చావు చావాలి కొడుకులు" అంటూ సూసైడ్ లెటర్‌లో బాలిక రాసుకొచ్చింది. కూతురు మరణంపై బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. భయపడిన సూర్యప్రకాష్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో బాలికను పెళ్లి చేసుకున్న సాయికుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాలిక పెళ్లికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ ఇప్పుడిదే హాట్ టాపిక్‌గా మారింది.












Click it and Unblock the Notifications