శ్రీవారిని దర్శించుకున్న సిమ్రాన్, నాదెండ్ల మనోహర్
తిరుపతి: హీరోయిన్ సిమ్రాన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం భర్త, పిల్లలతో కలిసి వచ్చిన సిమ్రాన్ పిల్లల తలనీలాలు స్వామి వారికి సమర్పించి మొక్కు తీర్చుకున్నారు.
మంగళవారం ఉదయం విఐపి బ్రేక్ ప్రారంభ సమయంలో స్వామి వారిని దర్శించుకున్నారు. దర్శన అనంతరం ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. రెండో కుమారుడి పుట్టు వెంట్రుకలను తీయడానికి సిమ్రాన్ కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు వచ్చారు.

రాష్ట్ర శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం విఐపి బ్రేక్ ప్రారంభసమయంలో స్పీకర్ శ్రీవారిని దర్శించుకున్నారు.
దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు నాదెండ్లను ఆశీర్వదించారు. అలాగే ఆలయ అధికారులు స్వామి వారి శేషవస్త్రాలు బహూకరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.












Click it and Unblock the Notifications