Singanamala:శింగనమలలో ప్రధాన పార్టీలకు శైలజానాథ్ భయం..?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉమ్మడి అనంతపురం జిల్లాకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ జిల్లా నుంచి గతంలో ఎన్టీఆర్‌తో సహా మహామహులు పోటీ చేసి గెలుపొందారు. మరి కొద్ది రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఉమ్మడి అనంతపురం జిల్లా హెడ్‌లైన్స్‌లో నిలుస్తోంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని నియోజకవర్గాలు అన్నిటిలోనూ పోటీ ప్రధానంగా వైసీపీ -టీడీపీ జనసేన బీజేపీ కూటమి మధ్యే ఉండగా... ఒక్క శింగనమల నియోజకవర్గంలో మాత్రం ముక్కోణపు పోటీ నెలకొంది. ఇక్కడ అధికారిక వైసీపీ టీడీపీతో పాటు కాంగ్రెస్ కూడా గట్టి పోటీని ఇస్తుండటం విశేషం. ఈ ట్రయాంగ్యులర్ ఫైట్‌లో ఎవరు ఎవరికి గండి కొడతారనేది ఆసక్తికరంగా మారింది.

శింగనమలలో ముక్కోణపు పోటీ

శింగనమల నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్‌డ్‌ స్థానం. ఇక్కడ గత ఎన్నికలను పరిశీలిస్తే 2004, 2009లో కాంగ్రెస్‌ నుంచి మాజీ పీసీసీ చీఫ్ సాకే శైలజానాథ్ విజేతగా నిలిచారు. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా కూడా పనిచేశారు శైలజానాథ్. ఇక 2014లో రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీ మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. అలాంటి సమయంలో పీసీసీ పగ్గాలు చేపట్టిన సాకే శైలజానాథ్ తిరిగి ఆ పార్టీకి జీవం పోశారు.ఈ సారి శైలజానాథ్ శింగనమల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. అదే సమయంలో వైసీపీ నుంచి తొలిసారిగా వీరాంజనేయులు బరిలో నిలుస్తుండగా.. బండారు శ్రావణశ్రీ మరోసారి టీడీపీ నుంచి తాను అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.

Bandaru sravani TDP candidate

శ్రావణికి తప్పని ఇంటిపోరు

శింగనమల నియోజకవర్గంలో బండారు శ్రావణిశ్రీకి ఇంటిపోరు తప్పడంలేదు. అక్కడ ఆమెకు సొంత కూటమి నుంచే సహకరించే పరిస్థితులు కనిపించడంలేదు. గతంలో శింగనమల టీడీపీ సీనియర్ నాయకులు బండారు శ్రావణికోసం గడపగడప తిరిగి ప్రచారం చేశారు. అయితే ఆమె టీడీపీ సీనియర్ నేతలపైనే కేసులు పెట్టడంతో శ్రావణికి ఎట్టి పరిస్థితుల్లో సహకరించేది లేదని తేల్చేశారు. దీంతో శ్రావణి గెలుపు పై నీలినీడలు అలుముకున్నాయి. అంతేకాదు శైలజానాథ్ రూపంలో టీడీపీకి మరో ముప్పు పొంచి ఉంది. శైలజానాథ్‌కు ఉన్న పరిచయాలు కేవలం కాంగ్రెస్ పార్టీకే పరిమితం కాదు. ఇతర పార్టీల వారితో కూడా మంచి సత్సంబంధాలు కలిగి ఉన్నారు.ఇప్పుడు ఇదే ఆయనకు ప్లస్ పాయింట్‌గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.శ్రావణిని వ్యతిరేకిస్తున్న టీడీపీలోని ఒకవర్గం శైలజానాథ్‌కు మద్దతు ఇస్తున్నామంటూ బాహాటంగానే చెబుతున్నారు.

కీలకంగా సాకే శైలజానాథ్

ఇక శింగనమలలో శైలజానాథ్‌కు సామాజిక సమీకరణాలు కూడా కలిసొచ్చే అంశంగా ఉంది.శైలజానాథ్ పోటీ చేస్తే తమకు ఇబ్బందులు తప్పవని తెలుసుకున్న రెండు ప్రధాన పార్టీలు ఆయన్ను వారి వారి పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు కూడా చేశాయి. అయితే శైలజానాథ్ మాత్రం తాను కాంగ్రెస్ నుంచే పోటీ చేస్తానని తెగేసి చెప్పడంతో ఈయన శింగనమలలో చాలా కీలకంగా మారారు. కట్ చేస్తే కాంగ్రెస్ నుంచే 2024 అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచారు శైలజానాథ్.

sailajanath congress

తాను నామినేషన్ వేసిన సందర్భంగా అటు కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు వైసీపీ టీడీపీ కార్యకర్తలు కూడా పాల్గొన్నట్లు సమాచారం.అంతేకాదు చాలామంది సెల్ఫీలు కూడా దిగడం కనిపించింది. ఇక మంత్రిగా శైలజానాథ్ చేసిన అభివృద్ధిని సైతం అక్కడి ప్రజలు ఇప్పటికీ గుర్తుచేసుకుంటున్నారంటే ఆయన క్రేజ్ శింగనమలలో మామూలుగా లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అంతా సవ్యంగా సాగితే ఈ త్రిముఖ పోరులో శైలజానాథ్‌ గెలిచే అవకాశాలున్నాయని మరోసారి ఆయన్ను అసెంబ్లీలో చూడొచ్చన్న అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+