ఏపీ రాజధానికి కొన్ని ఇబ్బందులు, హైద్రాబాద్‌లో ఉండొచ్చు కానీ: బాబు

హైదరాబాద్: నూతన రాజధాని నిర్మాణానికి మనకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయని, అయితే, భవిష్యత్తులో వాటిని అధిగమిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం ధీమా వ్యక్తం చేశారు. సింగపూర్ మంత్రి ఈశ్వరన్ బృందం రాజధానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ అందించింది.

ఈ సందర్భంగా సింగపూర్ ప్రతినిధులు, చంద్రబాబు మాట్లాడారు. ఒక పద్ధతి ప్రకారం మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నామని ఇంతకుముందే చెప్పామన్నారు. మాస్టర్ ప్లాన్ తయారు చేసేందుకు సింగపూర్ ప్రభుత్వం ముందుకు రావడం సంతోషమన్నారు. ఇది అరుదైన అనుభవమన్నారు.

రాజధాని పైన చర్చల కోసం వారు ఇక్కడకు రావడం, మనం అక్కడకు వెళ్లడం జరిగిందన్నారు. మాస్టర్ ప్లాన్ ఇచ్చారని, రాబోయే రోజుల్లో సీడ్ క్యాపిటల్ ప్లాన్ ఇవ్వాల్సి ఉందన్నారు. నూతన రాజధాని నిర్మాణం ఏర్పాటు చేసుకునేందుకు మనకు చాలా ఇబ్బందులు ఉన్నాయన్నారు.

తాత్కాలికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ భవిష్యత్తులో ఏపీ బెస్ట్ రాష్ట్రంగా నిలుస్తుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. రాజధానికి వెళ్లేందుకు ఉద్యోగులకు ఇళ్లు కూడా లేని పరిస్థితి ఉందన్నారు. రాజధాని అంటే పరిపాలనకు సంబంధించిందే కాదన్నారు. అన్ని కోణాల్లోను చూడాల్సి ఉంటుందన్నారు.

అమరావతిని అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకోవాల్సి ఉందన్నారు. ఇప్పటికే ఏడాది అయినందున జూన్ 6న భూమిపూజ చేస్తున్నామని, విజయ దశమి నాడు పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. అందర్నీ కలుపుకొని రాజధానిని డైనమిక్ సిటీగా నిర్మిస్తామన్నారు.

భావి తరాలకు, భవిష్యత్తుకు అవసకమైన అన్ని హంగులు ఉంటాయన్నారు. మాస్టర్ ప్లాన్ అందించిన సింగపూర్ ప్రభుత్వాన్ని, సింగపూర్ కన్సార్టియంను అభినందిస్తున్నానని చెప్పారు. రాజధానిపై ఇంకా వేగంగా ముందుకు వెళ్తామని చెప్పారు. అమరావతి ప్రజా రాజధానిగా ఉండాలన్నారు.

Singapore presents AP capital city master plan today

రాజధానికి సంబంధించి అన్ని వివరాలు సింగపూర్ ప్రతినిధులు అందించారన్నారు. ఏపీలో ఉపాధి అవకాశాలు రావాలని, ఆర్థిక వనరులు సమకూర్చే నగరంగా, డైనమిక్ సిటీగా, ఈ సెంచరీలో బెస్ట్ సిటీగా ఉండేలా నిర్మించుకుందామన్నారు.

ఈ సందర్భంగా రాజధానికి భూమి ఇచ్చిన రైతులను ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు. రాజధాని ప్రాంతంలో భూమి లేని వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. ఈ శతాబ్దంలోనే అత్యాధునిక హంగులతో రాజధాని ఉంటుందన్నారు.

భూములు ఇఛ్చిన రైతులకు రాజధాని ప్రాంతంలోనే భూములు ఇచ్చే విషయమై మాట్లాడుతూ.. భూములిచ్చిన రైతులకు ల్యాండ్ వ్యాల్యూ బాగా పెరిగే చోట భూమి ఇచ్చే విషయంపై ఆలోచన చేయాలన్నారు. రైతులను మరవలేమన్నారు.

ప్రస్తుతం తమ పైన రెండు బాధ్యతలు ఉన్నాయని చెప్పారు. రైతులకు అభివృద్ధి చేసి ఇచ్చే ప్లాట్ల విలువ పెరగాలన్నారు. దానికి ఏం చేయాలో చూస్తామన్నారు. మరోవైపు, మనం కట్టే రాజధాని 21వ సెంచరీది కాబట్టి దానికి అనుగుణంగా ఉంటుందన్నారు. ఇంకా వినూత్న ఆలోచనలు ఎవరికైనా వస్తే వాటిని స్వీకరిస్తామన్నారు.

ఒక మహా నగరాన్ని నిర్మించాలంటే ఎంతో అనుభవం కావాలన్నారు. ఓ ఆర్కిటెక్ట్‌కు ఇస్తే ఇది అప్పుడే అయ్యే పని కాదన్నారు. సింగపూర్ ప్రణాళికతో నిర్మించుకుందని, అందుకే వారికి ఇచ్చామని, వారి మాస్టర్ ప్లాన్ బాగా ఇచ్చారన్నారు. రాజధాని నిర్మాణం కోసం ఇంకా నిధులు వస్తున్నాయని చెప్పారు.

ప్రజలు గర్వపడేలా నూతన రాజధాని నిర్మిస్తామన్నారు. కేంద్రం నుండి డబ్బులు రావాలని, వాటి గురించి మాట్లాడుతున్నామన్నారు. ప్రపంచస్థాయి వసతులతో రాజధాని నిర్మాణం ఉంటుందన్నారు. రాజధాని నిర్మాణానికి ప్రజలంతా సహకరించాలన్నారు. తనకు, తెలుగుదేశం పార్టీకి విశ్వసనీయత ఉందన్నారు.

పది సంవత్సరాలు ఉమ్మడి రాజధాని హైదరాబాదులో ఉండేందుకు అనుమతి ఉన్నప్పటికీ సాధ్యమైనంత త్వరగా వెళ్తేనే బాగుంటుందన్నారు. తెలంగాణ కూడా తెలుగు రాష్ట్రమేనని, అయితే స్థానికంగా ఉండి పాలిస్తే ప్రజలకు బాగుంటుందన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎలా విడిపోయిందో అందరికీ తెలుసన్నారు. మిగతా రాష్ట్రాలతో సమానంగా వచ్చే వరకు కేంద్రం ఏపీకి చేయూత ఇవ్వాలన్నారు. సింగపూర్ ప్రభుత్వం నిబద్ధతకు, పారదర్శకతకు మారుపేరు అన్నారు. వీలైనంత తొందరగా రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+