ఇద్దరూ ఒకే రకం డ్రస్సులు వేసుకుని...ఒకే చీరకు ఉరేసుకున్న అక్కచెళ్లెళ్లు:ఎందుకిలా?...

చిత్తూరు:ఆ ఇద్దరు అక్కచెళ్లెళ్లు చిన్నప్పటి నుంచి చాలా హుషారు...అంతేనా తామిద్దరూ ఆప్యాయంగా మెలగడమే కాదు అందరినీ అంతే ఆత్మీయంగా పలకరిస్తారు. ఎప్పుడూ ఒకేరకమైన డ్రస్సుల్లోనే కనిపించే ఆ అక్కాచెల్లెలు చదువు కూడా ఒకే కోర్సు ఎంచుకున్నారు. చదువు కోసం ఇంటి నుంచి దూరంగా వేరే పట్టణంలో చదువుకుంటున్న వీళ్లిద్దరూ సెలవులకని ఇంటికొచ్చారు. మరి ఏమైందో ఏమో ఆ అక్కాచెల్లెలు ఉన్నట్టుండి ఒకే చీరతో ఒకే కొక్కేనికి అటూ ఇటూ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. చిత్తూరు జిల్లా కలికిరి లో ఈ విషాదం చోటుచేసుకుంది.

Sister Commits Suicide In Chittoor

కలికిరికి చెందిన అక్కా చెల్లెళ్ళు తస్లీమా(19), షికాబీ(18) అక్కాచెల్లెలు ఇద్దరూ మదనపల్లె హార్సిలీహిల్స్‌ నర్సింగ్‌ కాలేజీలో బీఎస్సీ నర్సింగ్‌ కోర్సుచదువుతున్నారు. అక్క తస్లీమాఇవ్వడంతో పది రోజులు క్రితమే ఇంటికి తిరిగివచ్చారు. తండ్రి అజంతుల్లా ఉపాధి కోసం కువైట్‌ వెళ్లగా...తల్లి అలీమాబీ ఇంట్లోనే ఉంటోంది. వీళ్లిద్దరూ డాబా మీద గదిలో చదువుకుంటున్నారు.

ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం ఇద్దరు కుమార్తెలు భోజనానికి రాకపోవడంతో తల్లి అలిమాబీ సుమారు మూడు గంటల ప్రాంతంలో డాబా పై గది లోపలికి వెళ్లి చూడగా అక్కడ తన కుమార్తెలు ఇద్దరూ ఉరేసుకుని వేలాడుతూ ఉండడం చూసి పెద్ద పెద్దగా కేకలు వేసింది.

ఇంటికి దగ్గరలోనే పోలీసు స్టేషను ఉండడంతో స్టేషన్ లో ఉన్న సిఐ సోమశేఖర్‌ రెడ్డి, ఎస్‌ఐ శ్రీనివాసులు సమాచారం తెలిసిన వెంటనే హుటాహుటిన ఘటనా స్థలానికి బయలుదేరి వచ్చారు. ఇంటి పై కప్పుకు ఉన్న మౌల్డింగ్‌ రాడ్‌కు చీర చుట్టిన అక్కాచెల్లెలు నిచ్చెన ఎక్కి అదే చీర చెరో కొస వీరి మెడకు బిగించుకున్నారు. ఆ తరువాత నిచ్చెన మీద నుండి దూకేసినట్లు ఘటనా స్థలంలోని ఆనవాళ్ళను బట్టి అర్థమవుతోంది.

అంతేకాదు వీళ్లు ఆత్మహత్య ప్లాన్ తోనే ముందే గదిలోకి నిచ్చెన తెచ్చిపెట్టినట్లు భావిస్తున్నారు. ఇంటి మొదటి అంతస్తులోని గదిలో ఈ సంఘటన జరిగింది. ఇరుకైన మెట్ల కారణంగా వాటి మీద నుంచి నిచ్చిన తీసుకెళ్లే అవకాశం లేకపోగా ఇంటి ముందు వైపు రోడ్డు మీద నుంచి నిచ్చెన మొదటి అంతస్తుకు చేర్చి ఉంటారని పోలీసులు అంచనా వేశారు. సీఐ సోమశేఖర్‌ రెడ్డి పర్యవేక్షణలో ఎస్‌ఐ శ్రీనివాసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

అజంతుల్లా, అలీమాబీ దంపతులకు తస్లీమా, షికాబీలే కాకుండా మహ్మద్‌ రఫీ అనే కొడుకున్నాడు.ఇతడు మహల్‌ ఉర్దూ కాలేజీలో ఇంటర్మీడియట్‌ చదువుతున్నాడు. అక్కా చెల్లెళ్ళు ఇద్దరూ ఎంతో కలివిడిగా, అన్యోన్యంగా వుండే వారని చుట్టుపక్కల వారు చెప్పారు. ఈ రోజు ఉదయం కూడా ఇద్దరూ చక్కగా రెడీ అయ్యి ఒకే రకం డ్రస్సులు వేసుకున్నారని...చివరకు ఒకే కొక్కీకి, ఒకే చీరకు ఇలా ఉరేసుకొని చనిపోయారని చట్టుప్రక్కలవారిని కంట తడి పెట్టించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+