తిరుమల లడ్డూ విచారణలో కీలక పరిణామం..!!

తిరుమల లడ్డూ కల్తీ వివాదం పై విచారణ మొదలైంది. తిరుమల లడ్డూ వివాదం పై దర్యాప్తు కోసం సుప్రీం కోర్టు ప్రత్యేకంగా సిట్ నియమించింది. ఈ విచారణ టీం తిరుమల కేంద్రంగా ప్రాధమిక సమాచార సేకరణ ప్రారంభించింది. తిరుపతి భూదేవి కాంప్లెక్స్‌లో తాత్కాలిక కార్యాలయం ఏర్పాటు చేశారు. సిట్‌ అధికారులు 4 బృందాలుగా ఏర్పడి విచారణ కొనసాగిస్తున్నారు. తిరుమల లడ్డూ తయారీ మొదలు నెయ్యి సరఫరా సంస్థల వరకు పరిశీలన చేయనున్నారు. లడ్డూ తయారీ సిబ్బందిని సిట్ ప్రశ్నించే ఛాన్స్ ఉంది. సిట్ ఇచ్చే నివేదిక కీలకం కానుంది.

దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున దుమారం రేపిన వివాదం పై సిట్ దర్యాప్తు ప్రారంభించింది. తిరుమల లడ్డూ అపవిత్రం అయిందంటూ వచ్చిన ఆరోపణల పైన విచారణ చేయాలని వైసీపీ నేతలతో పాటుగా సుప్రీం న్యాయవాది సుబ్రమణ్య స్వామి..మరి కొన్ని సంస్థలు సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేసాయి. విచారణ చేసిన సుప్రీంకోర్టు సీబీఐ డైరెక్టర్ నాయకత్వంలో ప్రత్యేక విచారణ కమిటీని నియమించింది. ఈ కమిటీ లో కేంద్ర, రాష్ట్ర అధికారులు ఉన్నారు. ఈ కమిటీ తిరుపతి కేంద్రంగా కార్యాలయం ఏర్పాటు చేసుకొని తిరుమల నుంచి విచారణ మొదలు పెట్టింది.

SIT begins investigation on Adulterated Ghee in Tirumala case as Supreme Orders

తిరుమలలో కల్తీ లడ్డు పైన విచారిస్తున్న కమిటీ నెయ్యి సరఫరా చేసిన ఏఆర్‌ డెయిరీ ఫుడ్స్‌ను పరిశీలించనుంది. తిరుమలలో లడ్డూ పోటు తో పాటుగ విక్రయ కేంద్రాలు, లడ్డూ తయారీలో వినియోగించే ముడిసరకు కేంద్రాలను పరిశీలిస్తారు. అదే విధంగా లడ్డూ తయారు చేసే సిబ్బంది ని సైతం ప్రశ్నించే అవకాశం ఉందని తెలుస్తోంది. తిరుమల లడ్డూ తయారీకి వాడే నెయ్యిలో కల్తీ జరిగినట్లు ఎన్‍డీడీబీ పరీక్ష నివేదిక పేర్కొనటంతో ఆ నివేదికలో పేర్కొన్న అంశాలు.. అదే విధంగా తయారీలో తీసుకుంటున్న జాగ్రత్తల పైన ప్రత్యేకగా దర్యాప్తు సంస్థ ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. అన్ని కోణాల్లోనూ విచారణ పూర్తి చేసిన తరువాత సిట్ నివేదికను ఇవ్వనుంది. దేశ వ్యాప్తంగా సిట్ ఈ విచరణలో తేల్చే అంశాల పైన ఆసక్తిగా చూస్తున్నారు. రాజకీయంగానూ ఈ వివాదం పైన పెద్ద ఎత్తున దుమారం చోటు చేసుకుంది.

ఈ సిట్ లో ఏపీకి చెందిన అధికారులు గుంటూరు రేంజి ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, విశాఖ రేంజి డీఐజీ గోపీనాథ్‌ జెట్టీ ఉన్నారు. సీబీఐ నుంచి హైదరాబాద్‌ జోన్‌ జాయింట్‌ డైరెక్టర్‌ వీరేశ్‌ ప్రభు, విశాఖపట్నం ఎస్పీ మురళి రాంబాతో పాటు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ (నాణ్యత హామీ) సలహాదారు డాక్టర్‌ సత్యేన్‌కుమార్‌ పాండా ఉన్నారు. రికార్డులు భద్రపరిచేందుకు వీలుగా ప్రత్యేక గదితో పాటుగ, వీడియో కాన్ఫరెన్సులు నిర్వహించుకునేందుకు అనుగుణంగా భవనాలను కేటాయించాలని తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సీబీఐ కోరింది. దీంతో, సాధ్యమైనంత త్వరగా విచారణ పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని సిట్ భావిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+