రాజధాని భూ కుంభకోణం .. దర్యాప్తులో సిట్ దూకుడు .. ఆ ఉన్నతాధికారుల్లో వణుకు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఆర్డీఏ రీజియన్ లో భూలావాదేవీల్లో అక్రమాలు జరిగాయని అధికారం చేపట్టిన నాటి నుండి ఆరోపిస్తున్న ఏపీ ప్రభుత్వం ఆ అక్రమాల నిగ్గు తేల్చే పనిలో సిట్ ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే . రాజధాని అమరావతి భూముల కుంభకోణంలో అక్రమాల దర్యాప్తులో సిట్ దూకుడు పెంచింది. టిడిపి హయాంలో జరిగిన ల్యాండ్ పూలింగ్ విషయంలో కుంభకోణం జరిగిందని నిర్ధారించిన సిట్ అప్పుడు ఇన్ఛార్జ్ లుగా పనిచేసిన డిప్యూటీ కలెక్టర్ లపై విచారణ చేపట్టింది.
Recommended Video

ల్యాండ్ పూలింగ్ లో అక్రమాలతో డిప్యూటీ కలెక్టర్ మాధురి అరెస్ట్ ..
ఇటీవల నెక్కల్లు డిప్యూటీ కలెక్టర్ మాధురి అరెస్ట్ చేసిన పోలీసులు అమరావతి ల్యాండ్ పూలింగ్ లో అక్రమాలు చేసినట్టు, తప్పుడు రికార్డులు సృష్టించినట్లు నిర్ధారించారు. ప్రస్తుతం మాధురి గుంటూరు జిల్లా జైలులో రిమాండ్ లో ఉన్నారు. తుళ్లూరు మండలం నెక్కల్లు గ్రామానికి చెందిన టిడిపి నేత రావుల గోపాలకృష్ణ తో కుమ్మకై అక్రమ మార్గంలో 3880 చదరపు గజాల 10 ప్లాట్లను కేటాయించడమే కాకుండా 5.26 లక్షల రూపాయల కౌలు కూడా చెల్లించారు. చేసిన అక్రమాలు కప్పిపుచ్చుకునేందుకే తప్పుడు తేదీలతో నకిలీ రికార్డులు సృష్టించారని గుర్తించిన సిట్ అధికారులు డిప్యూటీ కలెక్టర్ మాధురిపై కేసు నమోదు చేశారు.

రాజధానిలో ప్రభుత్వ భూములు , కుంటలు , గ్రామ కంఠంభూములను వదలని అక్రమార్కులు
ఇక డిప్యూటీ కలెక్టర్ మాధురి మాత్రమే కాకుండా,మరికొంత మందిని కూడా అదుపులోకి తీసుకొని విచారించనుందని తెలుస్తుంది. రైతుల భూములు ఇచ్చేందుకు ఒప్పించిన వారికి బహుమానంగా స్థలాలను అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేసినట్లుగా సిట్ అధికారులు గుర్తించారు. ఇక అంతే కాదు ప్రభుత్వ భూములు, అటవీ భూములు, కుంటలు, గ్రామ కంఠం భూములు సైతం వదలకుండా టిడిపి నేతలు,జిల్లాస్థాయి ఉన్నతాధికారులు, రెవెన్యూ అధికారులు అవినీతికి పాల్పడ్డారని సిట్ దర్యాప్తు బృందం గుర్తించింది. మొత్తం 150 ఎకరాల భూ కుంభకోణం జరిగినట్లుగా ఇప్పటి వరకు గుర్తించారు.

ఆ అవినీతి అధికారుల గుండెల్లో దడ
టిడిపి నేతల అక్రమాలకు కొమ్ము కాసి, తప్పుడు రికార్డులు సృష్టించిన, అవినీతికి పాల్పడిన అధికారుల గుండెల్లో ఇటీవల డిప్యూటీ కలెక్టర్ మాధురి అరెస్టుతో దడ మొదలైంది. అవసరం అనుకుంటే మరికొందరు డిప్యూటీ కలెక్టర్లను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలియడంతో ఉన్నతాధికారులలో వణుకు మొదలైంది. ఇక అంతే కాదుగ్రామ కంఠం భూముల అవకతవకల పైనా సిట్ నాజర్ పెట్టింది అప్పటి అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న కొందరి భూములను గ్రామ కంఠం పేరుతో వదిలేసి లబ్ది చేకూర్చిన అంశాలపై కూడా ఆరా తీస్తున్న సిట్ నిజానిజాల నిగ్గు తేల్చే పనిలో ఉంది.
-
ఈ ప్రాంతాల్లో వంట గ్యాస్ సరఫరా పై ప్రభుత్వం కీలక నిర్ణయం, ఇక నుంచి..!! -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
అసెంబ్లీ తీర్మానం వేళ 'అమరావతి'పై తేల్చేసిన జగన్, గతం గతః- సంచలన ప్రకటన..!! -
14కు మార్కాపురం బస్సు ప్రమాద మృతులు.. ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం చంద్రబాబు! -
అమరావతిలో నిర్మాణాల వేళ 'మాస్టర్ ప్లాన్', కీలక మలుపు..!! -
విద్యుత్ ఛార్జీల పై ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, ఇక కొత్తగా..!! -
అమరావతి ఇక నుంచి.. ఏపీ కేబినెట్ సంచలన తీర్మానం..!! -
మార్కాపురం ప్రమాద ఘటన: చంద్రబాబు దృష్టికి ప్రమాద కారణం, సీఎం రేవంత్ దిగ్భ్రాంతి! -
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
Amaravati: పీఎంవో అత్యవసర ఆదేశాలు-28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక భేటీ..! -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !!












Click it and Unblock the Notifications