Video : పాస్టర్ ప్రవీణ్ కేసులో అనూహ్య ట్విస్ట్ - మరణానికి ముందు..!!

పాస్టర్‌ పగడాల ప్రవీణ్‌కుమార్‌ అనుమానాస్పద మృతి కేసులో కీలక అంశాలు వెలుగులోకి వస్తు న్నాయి. ఈ కేసును పోలీసులు పూర్తి సాంకేతికత... ఆధారాలతో విచారణ చేస్తున్నారు. కేసులోని చిక్కుముళ్లు ఒక్కొక్కటిగా వీడుతున్నాయి. సీసీ కెమేరాల్లో రికార్డు అయిన విజువల్స్ ఈ కేసులో కీలకంగా మారాయి. విజయవాడ రాకముందే ప్రవీణ్ బైక్ పై నుంచి పాస్టర్ ప్రవీణ్ పడిపోయినట్లు తాజాగా గుర్తించారు. టోల్ సిబ్బంది ఆయన గాయాలను శుభ్రం చేసారు. ఆయన మరణానికి ముందు ఏం జరిగిందనేది పోలీసులు పూర్తి స్థాయిలో సమాచారం సేకరిస్తున్నారు.

కీలక ఆధారాలు
పాస్టర్‌ పగడాల ప్రవీణ్‌కుమార్‌ అనుమానాస్పద మృతి కేసు విచారణలో కీలక అంశాలు బయటకు వస్తున్నాయి. హైదరాబాద్ నుంచి బైక్ పైన ప్రవీణ్ కుమార్ బయల్దేరిన సమయం నుంచి ప్రమాదం చోటు చేసుకున్న ప్రాంతం వరకు ఏం జరిగిందనేది పోలీసులు నిశితంగా సమాచారం సేకరిస్తున్నారు. సీసీ టీవీ ఫుటేజ్ ద్వారా ఆధారాలను గుర్తిస్తున్నారు. హైదరాబాద్ నుంచి బయలు దేరిన ప్రవీణ్ కుమార్ ఎన్టీఆర్‌ జిల్లాలోకి ప్రవేశించిన తర్వాత కీసర టోల్‌ప్లాజాలోకి రావడానికి ముందు ప్రమాదం బారిన పడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజీ తాజాగా వెలుగులోకి వచ్చింది. 24వ తేదీన ప్రవీణ్‌ విజయవాడలోని గొల్లపూడి వద్ద ఉన్న పెట్రోలు బంకుకు చేరుకునే సమయానికి గాయాలు ఉన్నట్టు అక్కడ సిబ్బంది పోలీసులకు వివరించా రు. దీనికి ముందే ఆయన బుల్లెట్‌పై నుంచి అదుపుతప్పి పడిపోయారు.

sit-is-awaiting-the-fsl-report-in-pastor-praveen-kumar-suspicious-death

అదుపు తప్పి
ప్రవీణ కుమార్ కు సంబంధించి సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు విచారణ వేగవంతం చేసారు. జగ్గయ్యపేట వద్ద ముందుగా చిల్లకల్లు టోల్‌ప్లాజా వస్తుంది. ఇది దాటిన తర్వాత కీసర టోల్‌ప్లాజా. ప్రవీణ్‌కుమార్‌ 24వ తేదీ మధ్యాహ్నం 3.52 గంటలకు వేగంగా వస్తున్నట్టు సీసీ కెమెరాల్లో రికార్డయింది. సరిగ్గా మలుపు వద్దకు వచ్చేసరికి ఆయన అక్కడ వాహనాన్ని తిప్పలేదు. తిన్నగా వెళ్లిపోవడంతో జాతీయ రహదారికి పక్కన ఉన్న ప్రదేశంలో పడిపోయారు.

ఈ దృశ్యాలు సీసీ కెమెరాల ఫుటేజీలో కనిపిస్తున్నాయి. ప్రవీణ్‌ పడిపోయిన ప్రదేశానికి ముందు రెండో ఆటోలు ఉండడంతో మట్టి గాల్లోకి లేచిన దృశ్యాలు కనిపించాయి. దీన్ని టోల్‌ప్లాజా సిబ్బంది సైతం ధ్రువీకరించారు. బుల్లెట్‌పై నుంచి పాస్టర్‌ పడిపోవడంతో పెద్ద శబ్దం వచ్చింది. ఇది విన్న స్థానికులు అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు.

స్థానికుల సమాచారం
అదే సమయంలో ప్లాజా సిబ్బంది వెళ్లి పడిపోయిన ప్రవీణ్‌ను పైకి లేపి, బుల్లెట్‌పై కూర్చోబెట్టి నట్లు వెల్లడించారు. కీసర టోల్‌ వద్ద జరిగినట్టుగానే.. దీనికి ముందు మరో ప్రమాదం జరిగిందా అన్న సందేహం వ్యక్తమవుతోంది. టోల్‌ప్లాజా, అంబులెన్స్‌ సిబ్బంది ఘటనాస్థలానికి వెళ్లి ప్రవీణ్‌ కు ఏమైనా గాయాలయ్యాయా అని పరిశీలించారు. కుడి చేతిపై గీసుకున్నట్టుగా గాయం ఉన్నట్టు గుర్తించారు. దీన్ని బట్టి చూస్తే చిల్లకల్లు-కీసర టోల్‌ప్లాజాల మధ్య ప్రవీణ్‌కు మరో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. విజయవాడ వైపునకు వస్తున్న క్రమంలో చిల్లకల్లు టోల్‌గేట్‌ దాటిన తర్వాత ప్రవీణ్‌ అదుపుతప్పి పడిపోయి ఉండొచ్చని దర్యాప్తు బృందాలు అనుమానిస్తున్నాయి. దీంతో, పూర్తి స్థాయిలో సమాచారం సేకరిస్తున్నారు. ఎఫ్ఎస్ఎల్ నివేదక ఈ కేసులో కీలకంగా మారుతోంది. దీంతో, పోలీసులు ఈ కేసు పూర్తి విచారణ తరువాత వివరాల వెల్లడించే అవకాశం కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+