Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కల్తీ నెయ్యి సిట్ రిపోర్ట్ ప్రకంపనలు..! చంద్రబాబు, జగన్ ఎత్తుకుపైఎత్తులు..!

ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల (Tirumala) లడ్డూకు వాడిన నెయ్యి కల్తీ అయిందని, అందులో జంతువుల కొవ్వు కలిసిందంటూ గతంలో చంద్రబాబు చేసిన ఆరోపణలు సుప్రీంకోర్టు వరకూ వెళ్లి సిట్ ఏర్పాటు చేశారు. అనంతరం సిట్ తాజాగా కోర్టులో ఛార్జిషీట్ ఫైల్ చేసింది. ఈ ఛార్జిషీట్ లో తిరుమలకు వచ్చిన నెయ్యి కల్తీ నిజమే కానీ, అందులో జంతువుల కొవ్వు కలిసిన ఆనవాళ్లు లేవని తేల్చారు. దీంతో రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి.

సిట్ రిపోర్ట్ ప్రకంపనలు

తిరుమల లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలో పామాయిల్ తో పాటు రసాయనాలు కలిసి కల్తీ అయిందని సిట్ రిపోర్ట్ లో ఇచ్చారు. అయితే జంతువుల కొవ్వు ఆనవాళ్లు గుర్తించలేదన్నారు. 10 శాతం కంటే తక్కువ కొవ్వు కలిసినా గుర్తించలేమని ల్యాబ్ లు చెప్పాయి. అలాగే లడ్డూ తయారీలో రాజీ పడ్డారని టీటీడీలో కీలక అధికారులపై సిట్ దర్యాప్తులో తేలింది. దీంతో ఆయా అధికారులపై చర్యలకు రంగం సిద్దమవుతోంది. అయితే జంతువుల కొవ్వు విషయంలో చంద్రబాబు, పవన్ చేసిన ఆరోపణలు రుజువు కాలేదంటూ వైసీపీ ఎదురుదాడికి దిగుతోంది. దీనికి కౌంటర్ ఇచ్చేందుకు ప్రభుత్వం సిట్ రిపోర్ట్ తెప్పించుకుంది.

SIT Report on Tirumala Ghee Chandrababu amp amp Jagan s New Battle Plan

కూటమి వ్యూహం ఏంటి ?

తిరుమల లడ్డూకు వాడిన నెయ్యి కల్తీ అయినట్లు సిట్ రిపోర్ట్ లో తేలినా, జంతువుల కొవ్వు కలవలేదనే అంశాన్ని పట్టుకుని వైసీపీ తమకు తాము క్లీన్ సిట్ ఇచ్చుకోవడంపై ప్రభుత్వం ఆగ్రహంగా ఉంది. దీంతో సిట్ రిపోర్ట్ తెప్పించుకుని అందులో అంశాల ఆధారంగా చర్యలకు సిద్దమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇవే అంశాలతో బహిరంగంగానే ఫ్లెక్సీలు కూడా వేయిస్తోంది. దీంతో పాటు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో సిట్ రిపోర్ట్ పై చర్చ పెట్టి వైసీపీని పూర్తి స్ధాయిలో టార్గెట్ చేయాలని కూటమి ప్రభుత్వం వ్యూహరచన చేస్తోంది. అందుకే అసెంబ్లీకి రావాలని వైసీపీకి సవాళ్లు విసురుతోంది. కల్తీ నెయ్యి రిపోర్ట్ విషయంలో వైసీపీ దుష్ప్రచారం తిప్పికొట్టాలని మంత్రులకు చంద్రబాబు నుంచి ఆదేశాలు కూడా వెళ్లాయి.

SIT Report on Tirumala Ghee Chandrababu amp amp Jagan s New Battle Plan

వైఎస్సార్సీపీ వ్యూహం ఏంటి ?

నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందంటూ గతంలో చంద్రబాబు, పవన్ చేసిన ఆరోపణలు సిట్ రిపోర్ట్ లో నిజం కాదని తేలిపోవడంతో వైఎస్సార్సీపీ దూకుడుగా కౌంటర్ అటాక్ కు దిగుతోంది. నెయ్యి కల్తీ జరిగినా కొవ్వులు కలిశాయన్నది అబద్దమని చెబుతోంది. చంద్రబాబు హయాంలో టీటీడీకి వచ్చిన నెయ్యి ట్యాంకర్ల శాంపిల్స్ ను ల్యాబ్ కు పంపిస్తే వచ్చిన రిపోర్ట్ లను చూపి తమపై బురద జల్లడం ఏంటని వైసీపీ ప్రశ్నిస్తోంది. అలాగే తమపై ఎదురుదాడి కోసం రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ పెట్టిస్తున్న ఫ్లెక్సీలపై ఇప్పటికే డీజీపీకి ఫిర్యాదు చేసింది. అలాగే సిట్ రిపోర్ట్ తర్వాత తమపై కూటమి చేస్తున్న దుష్ప్రచారంపై సుప్రీంకోర్టును ఆశ్రయించబోతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+