• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఏపి ప‌్ర‌భుత్వం పై మ‌రో కుట్ర : ఎన్టీఆర్ పై చెప్పులు వేసింది వాళ్లే: గ‌రుడ శివాజీ మ‌రో సంచ‌ల‌నం..!

|
  Actor Shivaji Talks On Pawan Kalyan | Oneindia Telugu

  గ‌రుడ శివాజీ మ‌రోసారి సంచ‌ల‌నానికి కేంద్ర బిందువ‌య్యారు. వైశ్రాయ్ ఎపిసోడ్ కు శివాజీ కొత్త‌కోణం ఇచ్చారు. అది వెన్నుపోటు కాద‌ని..వెన్నుద‌న్న‌ని తేల్చేసారు. అస‌లు చంద్ర‌బాబు ఆ రోజు అలా చేయక పోతే టిడిపి నే కాదు..బిజెపి కూడా ఉండేది కాద‌ని కొత్త లింకు చెప్పుకొచ్చారు. చంద్ర‌బాబు నాడు వాజ్‌పేయ్‌ను ప్ర‌ధాని చేయ‌బ‌ట్టే..బిజెపి ఇప్ప‌టి దాకా బ‌తికి ఉంద‌ని విశ్లేషించారు. ఇక‌, 22ఏ భూముల గురించి మాట్లాడుతూ..చంద్ర‌బాబు మాట అధికారులు విన‌టం లేద‌న్నారు. అధికారులు ప‌ద్ద‌తి మార్చుకోకుంటే ఆమ‌ర‌ణ దీక్ష‌కు దిగుతాన‌ని హెచ్చ‌రించారు..

  నాడు ఎన్టీఆర్ పై చెప్పులు వేసింది ల‌క్ష్మీపార్వతి మ‌నుషులే..

  నాడు ఎన్టీఆర్ పై చెప్పులు వేసింది ల‌క్ష్మీపార్వతి మ‌నుషులే..

  గ‌రుడ ఫేమ్‌..సినిమా హీరో శివాజీ మ‌రో సారి సంచ‌ల‌న వ్యాఖ్య‌ల‌తో వార్త‌ల్లో నిలిచారు. ఆర్జీవి తీస్తున్న ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ పై స్పందించారు. అది ల‌క్ష్మీ పార్వ‌తి చీక‌టి రోజుల్లో ఎన్టీఆర్ జీవితం పై తీస్తున్న సినిమా గా భావిస్తున్నాన‌ని చెప్పారు. నాడు సుగ్రీవుడి కోసం రాముడు ఏం చేసాడో..టిడిపి కోసం..ఏపి కోసం చంద్ర‌బాబు సైతం అదే చేసార‌ని శివాజీ విశ్లేష‌ణ చేసారు. నాడు చంద్ర‌బాబు అలా చేయ‌క‌పోతే టిడిపి ఉండేది కాద‌ని తేల్చి చెప్పారు. చంద్ర‌బాబు తో పాటుగా కేసీఆర్ సైతం పార్టీ కోసం నాడు మ‌ద్ద‌తు ఇచ్చార‌ని వివ‌రించారు. ఇక‌, వైశ్రాయ్ హోట‌ల్ ఎపిసోడ్ కు తాను ప్రత్య‌క్ష సాక్షిన‌ని చెప్పిన శివాజీ.. నాడు ఎన్టీఆర్ పై చెప్పులు వేసింది లక్ష్మీ పార్వ‌తి మ‌నుషుల‌ని..ఆ ఘ‌ట‌న జ‌రిగిన వెంట‌నే అదే వ్యాన్ లో ఉన్న ప‌రిటాల ర‌వి కింద‌కు దూకార‌ని..అయితే వారు ల‌క్ష్మీ పార్వ‌తి మ‌నుషుల‌ని తెలిసి వెన‌క్కు త‌గ్గారని శివాజీ వైశ్రాయ్ ఎపిసోడ్ గురించి విశ్లేషించారు.

  వెన్ను పోటు కాదు వెన్నుద‌న్ను..బిజెపిని బ‌తికించారు.

  వెన్ను పోటు కాదు వెన్నుద‌న్ను..బిజెపిని బ‌తికించారు.

  ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ త‌న సినిమాలో ఓ పాట వెన్నుపోటు పేరుతో విడ‌దుల చేసార‌ని..వాస్త‌వంగా చంద్ర‌బాబుది వెన్నుపోటు కాద‌ని వెన్నుద‌న్ను అని శివాజీ కొత్త కోణం ఆవిష్క‌రించారు. నాడు చంద్ర‌బాబు అలా చేయ‌క‌పోతే టిడిపి తో పాటుగా ఏపికి భారీ న‌ష్టం జ‌రిగేదని విశ్లేషించారు. టిడిపి లక్ష్మీ పార్వ‌తి చేతుల్లోకి వెళ్లేద‌న్నారు. చంద్ర‌బాబు నాడు అలా చేయ‌బ‌ట్టే..టిడిపి బ‌తికింద‌ని..ఏపి బాగుప‌డింద‌ని వివ‌రించారు. దీనికి ప్ర‌జ‌లు 1999 లో మ‌రోసారి చంద్ర‌బాబు ను గెలిపించి ఆమోద ముద్ర వేసార‌న్నారు. చంద్ర‌బాబు లేక‌పోతే వాజ్‌పేయ్ ప్ర‌ధాని అయ్యేవారు కాద‌ని..అధికారం లోకి వ‌చ్చింది క‌నుకే..బిజెపి ఇప్ప‌టి దాకా పార్టీగా ఉండ‌గ‌లిగింద‌ని శివాజీ వివ‌రించారు. చంద్ర‌బాబు లేక‌పోతే నాడు వాజ్‌పేయ్ ప్ర‌ధాని అయ్యేవారు కాద‌ని పేర్కొన్నారు. ఆ విధంగా..టిడిపిని..బిజెపిని చంద్ర‌బాబు బ‌తికించార‌ని శివాజీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసారు.

  ప్ర‌భుత్వం పై మ‌రోకుట్ర‌..ఆమ‌ర‌ణ దీక్ష‌కు దిగుతా..

  ప్ర‌భుత్వం పై మ‌రోకుట్ర‌..ఆమ‌ర‌ణ దీక్ష‌కు దిగుతా..

  శివాజీ ప్ర‌భుత్వంలో వివాదాస్పదంగా మారిన 22ఏ భూముల వ్య‌వ‌హారం పై స్పందించారు. చంద్రబాబు ప్రభుత్వంపై కొత్త కుట్రకు మరోసారి ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. టీడీపీ నుంచి ఓటర్లను దూరం చేయాలని చూస్తు న్నారని మండిపడ్డారు. చుక్కల భూముల పేరుతో కుట్రకు తెరదీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చుక్కల భూముల రైతులను ప్రభుత్వంపై ఉసిగొల్పాలని కుట్ర చేస్తున్నారని వ్యాఖ్యానించారు. కొందరు అధికారులు ప్రభుత్వానికి వ్యతి రేకంగా పనిచేస్తున్నారని శివాజీ తెలిపారు. అంత ఇష్టముంటే రాజీనామా చేసి విపక్షపార్టీలో చేరాలని ఆయన సూచిం చారు. విపక్షానికి ప్రజాసమస్యలు పట్టవని.. వారికి కావాల్సింది సీఎం కుర్చీనేనని విమర్శించారు. చుక్కల భూములపై మంత్రులను అధికారులు లెక్కచేయడం లేదని వ్యాఖ్యానించారు. అన్ని ఆధారాలను సీఎం చంద్రబాబు కు అందజే స్తానని చెప్పారు. సంక్రాంతిలోగా సమస్యను పరిష్కరించకుంటే నిరాహార దీక్ష చేస్తానని శివాజీ ప్ర‌క‌టించారు.

  English summary
  Garuda Fame Sivaji says some govt officials working against C.M in AP. He suspected four officers in Govt. viceroy issue was only sake of TDP and AP said Mr Sivaji.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X