కృష్ణా కాల్పులు: గన్నవరం కోర్టులో 6గురు లొంగుబాటు

Six accused surrendered before Gannavaram court
విజయవాడ: కృష్ణా జిల్లాలోని గన్నవరం సమీపంలో గల పెదఅవుటపల్లి కాల్పుల కేసులో నిందితులుగా ఉన్న ఆరుగురు గురువారం ఉదయం గన్నవరం ఐదో మెట్రో పాలిటన్ కోర్టు ఎదుట లొంగిపోయారు. కోర్టులో లొంగిపోయిన వారిలో గణేష్, శ్రీను, పెదబాబు గోపిరాజు, వెంకటేష్, జీ శ్రీని తదితరులు ఉన్నారు.

కాగా, పెద్దఅవుటపల్లిలో జరిగిన ముగ్గురి హత్య కేసులో ఏడుగురు నిందితులను గత నెలలో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీలో అరెస్ట్ చేసినట్లు పోలీసులు అక్టోబర్ 7న (మంగళవారం) తెలిపారు. ఏడుగురు నిందితులను అప్పుడు మీడియా ముందు ప్రవేశపెట్టారు.

ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు, ఇందులో గోవింద్, శ్రీనివాసరావు ప్రధాన సూత్రధారులని పోలీసులు చెప్పారు. నిందితుల్లో నలుగురు కిరాయి హంతకులు ఉన్నారని పోలీసులు తెలిపారు. లండన్‌లో ఉంటున్న గోవింద్ ముగ్గురి హత్య కోసం నిందితులకు సుపారీ ఇచ్చినట్లు సమాచారం ఉందని పోలీసులు చెప్పారు. సుపారీ సుమారు రూ. కోటిపైనే ఉండవచ్చన్నారు.

సెప్టెంబర్ 24వ తేదీన కృష్ణా జిల్లా పెద్దఅవుటపల్లి జాతీయ రహదారిపై గంధం నాగేశ్వర రావు, అతని ఇద్దరు కుమారులు పగిడి మారయ్య, మారయ్య దారుణ హత్యకు గురయ్యారు. ఇప్పుడు ఆరుగురు నిందితులు కోర్టులో లొంగిపోవడం గమనార్హం.

తిరుమలలో మరోసారి అన్యమత ప్రచారం

తిరుమల కొండపై మరోసారి అన్యమత ప్రచారం కలకలం రేపింది. గురువారం ఉదయం శ్రీవారి ఆలయంలోపలి వెండి వాకిలిలో ముస్లిం, క్రైస్తవ చిహ్నాల కార్డులను పంచి పెడుతున్న ఓ యువకుడిని విజిలెన్స్‌ సిబ్బంది అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. యువకుడు చెన్నైకి చెందిన రామసీతారామన్‌గా గుర్తించారు.

సామ్‌ లగ్జరీ హోమ్స్‌లో భారీ అగ్నిప్రమాదం

బంజారాహిల్స్‌లో రోడ్‌ నెంబర్‌ 3లోని సామ్‌ లగ్జరీ హోమ్స్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అపార్ట్‌మెంట్‌ పెంట్‌ హౌస్‌లో అర్థరాత్రి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు వ్యాపించటంతో భయాందోళనకు గురైన అపార్ట్‌మెంట్‌ వాసులు ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపుచేశారు. షార్ట్‌సర్క్యూటే ప్రమాదానికి కారణంగా పోలీసులు భావిస్తున్నారు. ప్రమాద సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం జరగలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+