ఆరేళ్ల బాలికపై పక్కింటి వ్యక్తి అత్యాచారం
విశాఖ: ఆరేళ్ల చిన్నారి పైన ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన విశాఖపట్నం గాంధీ నగర్‌లో జరిగింది. ఓ వ్యక్తి తన మొదటి భార్య మృతి చెందడంతో వేరే యువతిని పెళ్లి చేసుకున్నాడు. మొదటి భార్యకు చెందిన ఇద్దరు పిల్లలను వసతి గృహంలో ఉంచారు.
వేసవి సెలవులు ఇవ్వడంతో పిల్లలు వచ్చారు. బుధవారం రాత్రి పిల్లలతో కలసి నిద్రపోయారు. అర్ధరాత్రి దాటిన తర్వాత పక్కన ఓ బాలిక కనిపించలేదు. చుట్టూ వెతకగా ఇంటిపక్కన దుప్పటిపై అపస్మారక స్థితిలో బాలిక కనిపించింది. విషయం తెలుసుకున్నారు. ఇంటి పక్కన వ్యక్తి అత్యాచారం చేశాడు. పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఎర్రచందనం దుంగలు స్వాధీనం
చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి మండలం ఎ రంగంపేట దగ్గర అటవీశాఖాధికారులు 20 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌తో సంబంధమున్న నలుగురిని అటవీశాఖాధికారులు అదుపులోకి తీసుకున్నారు.
రోడ్డు ప్రమాదంలో మృతి
కర్నూలు జిల్లాలోని కల్లూరు మండలంలో రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మరణించారు. వేగంగా వస్తున్న డీసీఎం వాహనం డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది. ఈ సంఘటనలో ముగ్గురు మరణించగా, 8 మందికి గాయాలయ్యాయి.












Click it and Unblock the Notifications