పుర్రె, ఎముకలు: తిరుమల కొండపై కలకలం
తిరుపతి: నిత్యం భక్తులతో ఎంతో రద్దీగా ఉండే తిరుమల కొండపై పుర్రె, ఎముకలు బయటపడటం కలకలంగా మారింది. వేలాది మంది భక్తులు వెళ్లే నడకదారిలోని జింకల పార్కు వద్ద మంగళవారం ఉదయం పుర్రె, ఎముకలు భక్తుల కంటపడటంతో వారు ఆందోళనకు గురయ్యారు.
నిత్యమూ రద్దీగా ఉండే ఘాట్ రోడ్డుకు అత్యంత సమీపంలోనే జింకల పార్కు ఉంటుంది. తిరుమల నుంచి కిందకు దిగివచ్చే వారు ఇక్కడ ఆగి, జింకలకు ఆహారాన్ని తినిపించి వెళుతుంటారు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఈ ప్రదేశానికి వీటిని ఎవరు, ఎక్కడి నుంచి తెచ్చి ఇక్కడ వేశారన్న విషయంపై పోలీసులు విచారణ చేపట్టారు.












Click it and Unblock the Notifications