హైదరాబాద్‌లో స్వల్ప భూప్రకంపనలు: పరుగులు తీసిన జనం
హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో భూప్రకంపనలు సంభవించాయి. చార్మినార్, బహదూర్‌పుర, హుస్సేనీ ఆలం, హసన్‌నగర్, నాగోలు, రాజేంద్రనగర్, బుద్వేలు, బహదుర్‌పుర, అత్తాపూర్, పద్మశాలినగర్‌లో భూప్రకంపనాలు సంభవించాయి. జనాలు భయంతో ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు.

భూ ప్రకంపనలు మూడు నుంచి నాలుగు సెకన్లు మాత్రమే ఉన్నట్టు స్థానికులు చెబుతున్నారు. దీంతో పలు చోట్ల ఇళ్లకు పగుళ్లు ఏర్పడ్డాయి. రాత్రంతా జనాలు జాగారం చేశారు. కంటి మీద కునుకు లేకుండా స్థానికులు భయాందోళనకు గురయ్యారు. భూకంప తీవ్రత రిక్టర్‌స్కేలుపై 1.8గా నమోదైనట్లు అధికారులు తెలిపారు.
బోరబండలో పోలీసుల కార్డన్ సెర్స్
బోరబండలోని పలు ప్రాంతాల్లో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. పశ్చిమ మండల డీసీపీ ఆధ్వర్యంలో 200 మంది పోలీసులు తనిఖీలు జరిపారు. తనిఖీల్లో భాగంగా 22 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 3 ఆటోలు, 4 బైక్‌లు, 120 గుడుంబా ప్యాకెట్లు, 50 లీటర్ల కిరోసిన్, 10 లీటర్ల పెట్రోల్ స్వాధీనం చేసుకున్నారు.
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
బీఎన్‌రెడ్డి నగర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. పెట్రోల్ ట్యాంకర్ - కారు ఢీ కొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.












Click it and Unblock the Notifications