నిన్న ఎలుకలు.. నేడు పాములు: ఆస్పత్రిలో నిలిచిన ఆపరేషన్లు
గుంటూరు: గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిని వివాదాలు విడిచిపెట్టడం లేదు. మొన్నటికి మొన్న ఓ చిన్నారి బాలుడు ఆ ఆస్పత్రిలో ఎలుకలు దాడి చేయడంతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో రాష్ట్ర, దేశవ్యాప్తంగానే కాక అంతర్జాతీయ మీడియాలోనూ ఈ ఆస్పత్రిపై కథనాలు వెలువడ్డాయి.
కాగా, గత వారం రేడియాలజీ వార్డులోని ఎలుకల బోనులో పాము చిక్కుకున్న ఘటన మరువక ముందే, తాజాగా సోమవారం ఆపరేషన్ థియేటర్లోనే పాము ప్రత్యక్షమై సిబ్బందిని ఉరుకులు, పరుగులు పెట్టించింది.
ఈ విషయాన్ని సూపరింటెండెంట్‌కు తెలియజేశారు. వెంటనే పాములు పట్టే వ్యక్తిని పిలిచి దానిని పట్టించారు. అయితే, అప్పటికే భయాందోళనకు గురైన డాక్టర్లు సర్జరీలు నిలిపివేసి థియేటర్ మొత్తాన్ని శుభ్రం చేయించే పనిలో పడ్డారు.

కాగా, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆదివారం రాత్రి ఆకస్మిక తనిఖీలు చేసి.. ఎలుకలు కనబడకూడదని హెచ్చరించిన పది గంటల్లోపే పాములు దర్శనమివ్వడం గమనార్హం.
ఇది ఇలా ఉండగా, రేడియాలజీ వార్డులోనే సోమవారం మధ్యాహ్నం కూడా మరో పాము కనిపించింది. దీంతో పలు ఆపరేషన్లు నిలిపివేశారు వైద్యులు. దీంతో పాములను తొలగించే పనిలో పడ్డారు ఆస్పత్రి సిబ్బంది.












Click it and Unblock the Notifications