విశాఖపట్నం ప్రజలు నిజంగా చాలా అదృష్టవంతులు!
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని భారతీయ రైల్వే విశాఖపట్నం నుంచి ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. షాలిమార్, కోయంబత్తూరు, ఎర్నాకుళం తదితర ప్రాంతాల నుంచి బయలుదేరే రైళ్లను విశాఖపట్నం ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు నగరం మీదగా నడిపించనున్నారు. దీనివల్ల రానున్న వేసవి రద్దీని ముందుగానే నియంత్రించినట్లవుతుందని అధికారులు చెబుతున్నారు.
నెంబర్ 02841 షాలిమార్ నుంచి ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ వరకు విశాఖ మీదగా నడుస్తుంది. జనవరి 29 సోమవారం మధ్యాహ్నం 2.35 గంటలకు షాలిమార్‌లో బయలుదేరుతుంది. దీనికి తిరుగు ప్రయాణం లేదు. వన్ వే స్పెషల్ ట్రైన్ గా నడుపుతున్నారు. విజయనగరం, విశాఖపట్నం, దువ్వాడ, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, గూడూరు రైల్వే స్టేషన్లలో మాత్రమే ఆగుతుంది.

నెంబర్ 05795 న్యూ జల్పాయ్‌గురి నుంచి కొయంబత్తూరు వరకు విశాఖపట్నం మీదగా నడుస్తుంది. ఇది కూడా వన్ వే స్పెషల్ ట్రైన్. జనవరి 29 సోమవారం రాత్రి 9.15 గంటలకు న్యూ జల్పాయ్‌గురిలో బయలుదేరి బుధవారం రాత్రి 8.30 గంటలకు కొయంబత్తూరు చేరుకుంటుంది. పలాస, విశాఖపట్నం, విజయవాడలో మాత్రమే ఆగుతుంది.
ఎర్నాకుళం-బ్రహ్మపూర్, బ్రహ్మపూర్-ఎర్నాకుళం మార్గంలో అన్‌రిజర్వ్‌డ్ రైళ్లను నడుపుతున్నారు. ఏపీలో గూడూరు, నెల్లూరు, ఒంగోలు, బాపట్ల, తెనాలి, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, దువ్వాడ, సింహాచలం నార్త్, పెందుర్తి, కొత్తవలస, విజయనగరం, చీపురుపల్లి, శ్రీకాకుళం రోడ్, పలాస, సోంపేట, ఇచ్ఛాపురం రైల్వే స్టేషన్లలో హాల్టింగ్ ఉంది.
నెంబర్ 06087 అన్‌రిజర్వ్‌డ్ ప్రత్యేక రైలు ఎర్నాకుళం నుంచి బ్రహ్మపూర్ మధ్య జనవరి 27, ఫిబ్రవరి 3, 10, 17, 24 తేదీల్లో తిరుగుతుంది. ఈ రైలు ఎర్నాకుళంలో శనివారం రాత్రి 11.00 గంటలకు బయలుదేరి సోమవారం తెల్లవారుజామున 5.00 గంటలకు బ్రహ్మపూర్ చేరుతుంది.
రైలు నెంబర్ 06088 అన్‌రిజర్వ్‌డ్ స్పెషల్ ట్రైన్ బ్రహ్మపూర్ నుంచి ఎర్నాకుళం మధ్య జనవరి 29, ఫిబ్రవరి 5, 12, 19, 26 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. ఈ రైలు బ్రహ్మపూర్‌లో సోమవారం మధ్యాహ్నం 12.40 గంటలకు బయల్దేరితే మరుసటి రోజు రాత్రి 9.40 గంటలకు ఎర్నాకుళం చేరుకుంటుంది.












Click it and Unblock the Notifications