జనవరి నెలలో ఈ రైళ్లన్నీ రద్దు

తరుచుగా రైలు ప్రయాణం చేసేవారికి ముఖ్య గమనిక. జనవరి నెలలో కొన్ని రైళ్లు రద్దయ్యాయి. విశాఖపట్నం టు గుణపూర్ ప్యాసింజర్ ప్రత్యేక రైలు జనవరి 3, 7, 10, 14, 17, 22, 31 తేదీల్లో రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారు. గుణపూర్ టు విశాఖపట్నం ప్యాసింజర్ ప్రత్యేక రైలు 3, 7, 10, 14, 17, 22, 31 తారీఖుల్లో రద్దు చేసినట్లు వెల్లడించారు.

రూర్కెలా టు గుణపూర్ రాజ్యరాణి ఎక్స్ ప్రెస్.. రూర్కెలా నుంచి జనవరి లో 2, 6, 9, 13, 16, 20, 23, 27, 30 పలాసలో షార్ట్ టర్మినేట్ అవుతుంది. ఈ తేదీల్లో పలాస నుంచి గుణపూర్ మధ్య సర్వీసు ఉండదు. నెం. 18118 గుణపూర్ టు రూర్కెలా గుణపూర్ రాజ్యరాణి ఎక్స్ ప్రెస్ 3, 7, 10, 14, 17, 21, 24, 28, 31 తేదీల్లో గుణపూర్‌కు బదులుగా పలాస నుంచి బయలుదేరుతుంది. ప్రయాణికుల రద్దీని పురస్కరించుకుని కొన్ని రైళ్లకు అదనపు కోచ్‌లను తాత్కాలికంగా పెంచనున్నారు. గుంటూరు టు రాయగడ ఎక్స్ ప్రెస్ కు రెండు స్లీపర్ క్లాస్ కోచ్‌లు, ఒక జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు పెంచారు. ఇది జనవరి 10వ తేదీ వరకు వర్తించనుంది.

 somany trains cancelled in january month

ఒడిసా రాష్ట్రంలోని బాలసోర్ వద్ద కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ప్రమాదానికి గురైన దుర్ఘటనలో దాదాపు 300కు పైగా ప్రయాణికులు దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఈ తరహా ప్రమాదం మరోసారి జరగకూడదనే ఉద్దేశంతో భారతీయ రైల్వే అన్ని జోన్లు, డివిజన్ల వారీగా సిగ్నలింగ్ వ్యవస్థను ఆధునికీకరిస్తోంది. అందులో భాగంగానే విశాఖపట్నం డివిజన్ పరిధిలో కూడా పనులు జరుగుతున్నాయి.

విశాఖపట్నంలో ప్రత్యేక రైల్వే జోన్ గా ఏర్పాటు చేయాల్సి ఉండగా కేంద్రం ప్రభుత్వ అలసత్వంతో వాయిదాలు పడుతూ వస్తోంది. ఉమ్మడి రాష్ట్రం విడిపోయినప్పుడు ప్రత్యేకంగా ఈ జోన్ ఏర్పాటు చేస్తామని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిందికానీ ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన నరేంద్రమోడీ ప్రభుత్వం మాత్రం జోన్ పై శీతకన్ను వేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+