విజయవాడ ప్రజలకు నరేంద్రమోడీ కీలక సూచన
తుపాను తీరం దాటడంతో రైల్వే యంత్రాంగం అప్రమత్తమైంది. డివిజన్ పరిధిలోని ఆయా స్టేషన్లలో ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా అనేక చర్యలు తీసుకుంది. ప్రత్యేక హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేసి ప్రయాణికులకు సమాచారం అందిస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యగా రైళ్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఇతర ప్రాంతాల్లో కూడా హైఅలర్ట్ ప్రకటించారు.
రైల్వే ట్రాక్‌పై నీరు చేరే అవకాశం ఉన్న ప్రదేశాల్లో అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. ప్రయాణికులకు అవసరమైన సాయం చేసేందుకు 24 గంటలూ రైల్వే సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు ప్రయాణికులతో కిటకిటలాడే విజయవాడ రైల్వేస్టేషన్ లో అన్ని ప్లాట్ ఫారాలు ఖాళీగా మారాయి. డివిజనల్ రైల్వే మేనేజర్ నరేంద్ర ఆనందరావు పాటిల్‌తో పాటు ఇతర విభాగాలకు చెందిన అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉన్నతాధికారులకు సమాచారం పంపిస్తున్నారు. రైళ్ల రద్దు, టికెట్ల వాపసు ద్వారా రైల్వే మంత్రిత్వశాఖకు రూ. కోట్లలో నష్టం వాటిల్లింది. తుపాను నేపథ్యంలో బుధవారం కూడా పలు రైళ్లను రద్దు చేశారు.

పూర్తిగా రద్దు చేసిన రైళ్లు
07784/07785 గుంటూరు- రేపల్లె,
07786 గుంటూరు-రేపల్లె,
07873/07874 రేపల్లె-తెనాలి,
07875/07876 రేపల్లె-తెనాలి,
07787/07888 రేపల్లె-తెనాలి,
07887 గుంటూరు-రేపల్లె,
22611 చెన్నైసెంట్రల్-న్యూజల్పాయిగురి.
పునరుద్ధరించిన రైళ్లు
తుపాను కారణంగా రద్దు చేసిన పలు రైళ్లను బుధవారం నుంచి పునరుద్ధరించారు.
నెం. 12710 సికింద్రాబాద్-గూడూరు,
నెం. 12733 తిరుపతి-లింగంపల్లి,
నెం. 12764 సికింద్రాబాద్-తిరుపతి,
నెం. 12710 కాకినాడటౌన్-బెంగళూరు.












Click it and Unblock the Notifications