నాగ్‌కి షాక్: కన్వెన్షన్‌లో వారే కూల్చుకున్నారు(పిక్చర్స్)
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలంలోని తుమ్మిడికుంట చెరువుకు చెందిన కొంత భూమిలో నిర్మించిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ భవనాలను యాజమాన్యమే తొలగిస్తున్న విషయం తెలిసిందే.
ఈ ఎన్ కన్వెన్షన్ సెంటర్ ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జునకు చెందినది. ఎఫ్‌టీఎల్ పరిధిలో నిర్మించిన ఈ భవనాల అంశం హైకోర్టు పరిధిలో ఉంది.
గ్రేటర్ హైదరాబాదు మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) నోటీసులు ఇవ్వకముందే యాజమాన్యం స్వచ్చంధంగా కూల్చివేతలు చేపట్టడం గమనార్హం.

ఎన్ కన్వెన్షన్
తుమ్మిడికుంట చెరువులోని నిర్మాణాలను ఎన్ కన్వెన్షన్ యాజమాన్యం శనివారం కూల్చివేసిన విషయం తెలిసిందే. ఆదివారం కూడా ఎన్ కన్వెన్షన్ యాజమాన్యం నిర్మాణాలను కొన్నింటిని కూల్చివేస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) నోటీసులు ఇవ్వకముందే యాజమాన్యం స్వచ్చంధంగా కూల్చివేతలు చేపట్టడం చర్చనీయాంశమైంది.

ఎన్ కన్వెన్షన్
గురుకుల్ ట్రస్టులో అక్రమ నిర్మాణాలను ప్రభుత్వ ఆదేశాల మేరకు జీహెచ్ఎంసీ అధికారులు కొద్ది రోజుల క్రితం కూల్చి వేశారు. ఇందులో భాగంగా తమ్మిడికుంట చెరువు శిఖం స్థలంలో నాగార్జున నిర్మించిన ఎన్ కన్వెన్షన్ సెంటర్‌పై కూడా అధికారులు చర్యలకు ఉపక్రమించారు.

ఎన్ కన్వెన్షన్
జీహెచ్ఎంసీ, రెవెన్యూ ఇరిగేషన్ అధికారుల సర్వేలో ఎన్ కన్వెన్షన్ సెంటర్‌లో 3 ఎకరాల 12 గుంటల స్థలాన్ని శిఖం భూమితో పాటు బఫర్ జోన్‌గా అధికారులు గుర్తించారు. ఎన్ కన్వెన్షన్ సెంటర్ పైన నాగార్జున కోర్టుకు వెళ్లారు. నోటీసులు జారీ చేసి, చర్యలు తీసుకోవాలని హైకోర్టు జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించింది.

ఎన్ కన్వెన్షన్
దీంతో, ఎన్ కన్వెన్షన్ యాజమాన్యం ముందుగానే దిద్దుబాటు చర్యలు ప్రారంభించినట్లుగా కనిపిస్తోంది. శనివారం సాయంత్రం, ఆదివారం ఎన్ కన్వెన్షన్‌లోని కొన్ని నిర్మాణాలను యాజమాన్యం స్వచ్చందంగా తొలగించింది.
-
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్‌ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
నో గ్యాస్.. హైదరాబాద్ హాస్టల్స్ లో టిఫిన్స్ బంద్.. -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు












Click it and Unblock the Notifications