తిరుపతికి వెరీ బ్యాడ్‌న్యూస్ వినిపించిన నరేంద్రమోడీ
తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్.. తమిళనాడు నుంచి తిరుపతికి వచ్చే కొన్ని రైళ్లను తాత్కాలికంగా రద్దు చేశారు. తిరుపతి రైల్వేస్టేషన్ ను అంతర్జాతీయస్థాయిలో ఉండేలా తీర్చిదిద్దుతున్నారు. దీనికి సంబంధించిన పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. తిరుపతి రైల్వేస్టేషన్ దేశంలోనే ప్రత్యేకంగా నిలిచిపోవాలనేది ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆకాంక్ష. ఆయన ఆకాంక్షకు అనుగుణంగా పనులు జరుగుతున్నాయి.
తిరుపతి-కాట్పాడి-తిరుపతి మధ్య ప్రతిరోజూ నడుస్తున్న ప్రత్యేక ప్యాసింజర్ రైళ్లను ఈనెల 27వ తేదీ నుంచి 30వ తేదీ వరకు రద్దు చేశారు. బెంగళూరు-తిరుపతి ఎక్స్‌ప్రెస్, కోయంబత్తూరు-తిరుపతి, విల్లుపురం-తిరుపతి మధ్య రాకపోకలు సాగిస్తున్న రైళ్లు కూడా రద్దయ్యాయి. ప్రయాణికులు సహకరించాలని అధికారులు కోరుతున్నారు. వేసవి రద్దీ ఎక్కువగా ఉండటంతో దక్షిణ మధ్య రైల్వే అధికారులు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. సికింద్రాబాద్ నుంచి తిరుపతికి ప్రత్యేక రైలును నడుపుతున్నారు. రాత్రి 10.00 గంటలకు సికింద్రాబాద్ లో బయలుదేరి కాచిగూడ, ఉందానగర్, షాద్ నగర్, జడ్చర్ల, మహబూబ్ నగర్, వనపర్తిరోడ్, గద్వాల, రాయచూర్, ఆదోని, మంత్రాలయంరోడ్ స్టేషన్లమీదగా తిరుపతికి చేరుకుంటుంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అధికారులు కోరారు.

ప్రధానమంత్రిగా నరేంద్రమోడీ బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశవ్యాప్తంగా రైల్వేస్టేషన్ల ఆధునికీకరణతోపాటు రైళ్లల్లో అత్యాధునిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యతనిస్తున్నారు. అందులో భాగంగా అమృత్ భారత్ పథకం కింద ఎంపికైన రైల్వేస్టేషన్లలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఏదేమైనప్పటికీ కొద్దిరోజులపాటు తిరుపతికి వెళ్లే రైళ్లను రద్దుచేయడంవల్ల నరేంద్రమోడీ బ్యాడ్ న్యూస్ వినిపించారంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.












Click it and Unblock the Notifications