వివాదం: వైయస్ విగ్రహానికి రంగుపూశారు! విగ్రహం వెనుక ‘ఎన్టీఆర్, టీడీపీ’!
గుంటూరు: జిల్లాలోని వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామంలోరాజకీయ వివాదం చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న దివంగత సీఎం వైయస్ విగ్రహనికి గుర్తు తెలియని దుండగులు ఎరుపు రంగు పూశారు.
అంతేగాక, విగ్రహం వెనుక భాగంలో ఎన్టీఆర్, టీడీపీ అని ఇంగ్లీష్ పదాలతో రాశారు. గుర్తు తెలియని వ్యక్తులు చేసిన ఈ ఘాతుకంతో ఇక్కడ రాజకీయ చిచ్చు రగిలింది. జరిగిన విషయం తెలుసుకున్న వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఘటన స్థలానికి చేరుకున్నారు.

వైసీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగగా.. పోలీసులు వారిని సముదాయించారు. ఈ ఘటనకు కారకులైన వారిని త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఇది ఇలా ఉంటే, మరో ప్రక్క టీడీపీ వర్గీయులను వారి కార్యకర్తలపైనే తమకు అనుమానాలు ఉన్నాయని జరిగిన ఘటనపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.












Click it and Unblock the Notifications