గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం, రాజమండ్రివారికి ముఖ్యమైన గమనిక
ఆంధ్రప్రదేశ్ లోని రైలు ప్రయాణికులకు ముఖ్యమైన గమనిక. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని విజయవాడ డివిజన్‌లో భద్రతా పరమైన పనులను ఆధునికీకరిస్తున్నారు. దీంతో కొన్ని రైళ్లను రద్దు చేయడంతో పాటు మరికొన్నింటిని కుదించారు. అక్టోబరు 2 నుంచి 8వ తేదీ వరకు గుంటూరు-విశాఖ(17239), మచిలీపట్నం-విశాఖ(17219), రాజమహేంద్రవరం-విశాఖ-రాజమహేంద్రవరం (07466-07467) రైళ్లను రద్దు చేశారు.
దారి మళ్లింపు : అక్టోబరు 3 నుంచి 9వ తేదీ వరకు విశాఖ-గుంటూరు (17240), విశాఖ-మచిలీపట్నం (17220) రైళ్లు రద్దయ్యాయి. విశాఖపట్నం-విజయవాడ-విశాఖపట్నం (22701-22702) ఉదయ్ ఎక్స్‌ప్రెస్ అక్టోబరు 2, 3, 4, 6, 7 తేదీల్లో రద్దు చేశారు. అలాగే ధన్‌బాద్-అలప్పూజా (13351) రైలను నిడదవోలు, భీమవరం టౌన్, గుడివాడ, విజయవాడ మీదుగా దారి మళ్లించనున్నారు. అక్టోబరు ఒకటో తేదీ నుంచి ఆరోతేదీ వరకు ఈ దారి మళ్లింపు ఉంటుంది.

రెండు స్టాప్స్ రద్దు : అక్టోబరు 6వ తేదీన టాటానగర్-ఎస్‌ఎంవి బెంగళూరు(12889).. అక్టోబరు 5వ తేదీన టాటా-యశ్వంత్‌పూర్(18111).. హాథియా-ఎస్‌ఎంవి బెంగళూరు(12835) అక్టోబరు 1, 3 తేదీల్లో.. జాషిది-తాంబరం(12376) అక్టోబరు 4న, హాథియా-ఎర్నాకుళం (22837) ఏసీ ఎక్స్‌ప్రెస్ అక్టోబరు 2న ళ్లింపు మార్గంలో నడవనున్నాయి. విజయవాడ నుంచి నేరుగా రాజమండ్రి వెళ్లే మార్గంలో ఉన్న ఏలూరు, తాడేపల్లి గూడెం స్టాప్స్ ను ఆయా తేదీల్లో రద్దు చేశామని, ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలనికోరారు.
అధునాతన సౌకర్యాలు : మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రయాణికులకు ఆధునిక సౌకర్యాలతో మంచి ప్రయాణ అనుభూతిని కల్పించేందుకు భారతీయ రైల్వే సెమీ హైస్పీడ్ రైలు వందే భారత్ ను ప్రవేశపెట్టాయి. దేశవ్యాప్తంగా 25 మార్గాల్లో 50 ట్రిప్పులు తిరుగుతున్న ఈ రైళ్లకు అదనంగా మరో 9 వందేభారత్ రైళ్లు వచ్చి కలిశాయి. ఇందులో రెండు రైళ్లను రెండు తెలుగు రాష్ట్రాలకు ఒక్కొక్కటి చొప్పున కేటాయించారు.












Click it and Unblock the Notifications