ఉమ్మడి కర్నూలు జిల్లాకు కీలక సూచన చేసిన నరేంద్రమోడీ
గుంటూరు నుంచి నంద్యాల మార్గంలో రైల్వే డబ్లింగ్ పనులు జరుగుతుండటంతో కొన్ని రైళ్లను రద్దుచేయడంతోపాటు మరికొన్ని రైళ్లను దారి మళ్లించి తిప్పుతున్నట్లు అధికారులు వెల్లడించారు. మరికొన్ని రైళ్ల సమయ వేళలను మార్చారు. అలాగే హైదరాబాద్ డివిజన్ పరిధిలో రెండు రైళ్లు రద్దు చేశారు. గుంతకల్లు-కాచిగూడ (17551) రైలును ఈనెల 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు రద్దు చేశారు. అలాగే కాచిగూడ-గుంతకల్లు (17252) రైలును 12వ తేదీ నుంచి 21వ తేదీవరకు రద్దుచేశారు. అలాగే నంద్యాల నుంచి గిద్దలూరు ఘాట్ మీదుగా గుంటూరుకు ప్రయాణించే రైలు వేళల్లో మార్పులు చేశారు.
కర్నూలు జిల్లాల ప్రజలు గమనించాలి
వీటితోపాటు కాచిగూడ, కర్నూలు, గుంతకల్లువైపు ప్రయాణించే రైలు సమయాలను కూడా మార్చారు. కేరళలో ఓనం పర్వదినాన్ని పురస్కరించుకొని కాచిగూడ నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కాచిగూడ-కొల్లం జంక్షన్ రైలు కర్నూలు మీదుగా నడుస్తుంది. ఈనెల 14వ తేదీన 07044 పేరుతో ఈ రైలు కాచిగూడ నుంచి సాయంత్రం 4.00 గంటలకు బయలుదేరి రాత్రి 8.00 గంటలకు కర్నూలు చేరుకొని, కొల్లంకు తర్వాతరోజు రాత్రి 11.20 గంటలకు చేరుకుంటుంది. అలాగే కొల్లం నుంచి 07045 పేరుతో 16వ తేదీ సోమవారం మధ్యాహ్నం 2.30 గంటలకు బయలుదేరి తర్వాత రోజు తెల్లవారుజామున 3.55 గంటలకు కర్నూలు చేరుకుంటుంది. కాచిగూడకు 9.45 గంటలకు వెళుతుంది. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు కోరారు. కర్నూలు జిల్లా ప్రజలు రైళ్ల రద్దుతోపాటు, సమయ వేళలు మార్చి రైళ్ల వివరాలను తెలుసుకోవాలని సూచించారు.

రద్దీకి అనుగుణంగా రైళ్లు
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని భారతీయ రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. అయితే రైళ్ల రద్దీ ఎక్కువవడంతో స్టేషన్ల బయటే అధిక సమయం నిలిచిపోవాల్సి వస్తోంది. దీనికి కారణం ప్లాట్ ఫాంలు ఖాళీ లేకపోవడమే. దీన్ని అధిగమించేందుకు నగరాలకు దగ్గరలో ఉండే కొన్ని స్టేషన్లను ప్రత్యేక టెర్మినల్స్ గా అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగానే సికింద్రాబాద్ కు సమీపంలో చర్లపల్లిని ప్రత్యేక టెర్మినల్ గా అభివృద్ధి చేస్తున్నారు. ఇది త్వరలోనే ప్రారంభం కాబోతోంది.












Click it and Unblock the Notifications