గుంతకల్లు, పాణ్యం ప్రజలను అప్రమత్తం చేసిన కేంద్రం
భారతీయ రైల్వేకు దేశవ్యాప్తంగా 1.30 లక్షల కిలోమీటర్ల మార్గం ఉంది. ప్రస్తుతం రైలు ప్రయాణాలు చేస్తున్నవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో సింగిల్ లైన్ ఉన్నచోట డబుల్ లైన్ నిర్మిస్తున్నారు. డబుల్ లైను ఉన్నచోట మూడో మార్గాన్ని నిర్మిస్తున్నారు. అలాగే ఏపీలోని గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధిలోని సిమెంట్ నగర్ - కృష్ణమ్మ కోన సెక్షన్ లో రైల్వే లైను డబ్లింగ్ పనులు జరుగుతున్నాయి. దీంతోపాటు పాణ్యం స్టేషన్ దగ్గర కూడా పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకొని గుత్తి, గుంతకల్లు మీదుగా వెళ్లే కొన్ని రైళ్లను దక్షిణ మధ్య రైల్వే అధికారులు దారి మళ్లించారు.
డిసెంబరు 6వ తేదీన 22883 పూరీ-యశ్వంత్ పూర్ గరీబ్ రథ్ వీక్లీ ఎక్స్ ప్రెస్ ను,డిసెంబరు 7వ తేదీన యశ్వంత్ పూర్ - పూరీ 22884 రైళ్లను డోన్ స్టేషన్ మీదుగా కాకుండా వేరేమార్గానికి మళ్లించారు. అనంతపురం, గుత్తి ఫోర్ట్, యర్రగుంట్ల, నంద్యాల మార్గంలో ఈ రైళ్లు నడుస్తాయి. ప్రయాణికులు ఈ విషయాలను గమనించాలని అధికారులు సూచించారు.

హౌరా-యశ్వంతపూర్ వీక్లీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (22831) రైలును డిసెంబరు 4, 11 తేదీల్లో,
యశ్వంత్‌పూర్-హౌరా రైలు (22832)ను డిసెంబరు 6, 13 తేదీల్లో అనంతపురం, గుత్తి ఫోర్ట్, యర్రగుంట్ల, నంద్యాల మార్గంలోకి మళ్లించారు.
విశాఖపట్నం నుంచి విజయవాడ మార్గం కూడా అత్యధిక రద్దీతో ఉండటంతో ఈ మార్గంలో కూడా మూడోమార్గాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే ఇది పూర్తికాబోతోంది. అలాగే విజయవాడ నుంచి గూడూరు మార్గం కూడా నిత్యం రద్దీగా ఉంటుంది. ఈ లైనులో మైడోలైను మార్గం దాదాపు పూర్తి కావొచ్చింది. దీనివల్ల ఇకనుంచి ఏ రైలును క్రాసింగ్ కోసం, ఇతర రైళ్లకు మార్గం ఇచ్చేందుకు, గూడ్స్ రైళ్ల కోసం ఆపాల్సిన అవసరం ఉండదు. అలాగే ప్రస్తుతం సూపర్ ఫాస్ట్ రైళ్ల వేగం గంటకు 110 నుంచి 120 కిలోమీటర్ల వరకు ఉంది. రైల్వే ట్రాక్ సామర్థ్యం 180 కిలోమీటర్ల వేగంతో వెళ్లినా తట్టుకునేలా నిర్మిస్తున్నారు. భవిష్యత్తులో ఈ మార్గంలో నడిచే రైళ్ల వేగాన్ని కూడా మార్చే అవకాశం ఉంది. దీనివల్ల కొన్ని రైళ్ల సమయవేళలు మారతాయి.












Click it and Unblock the Notifications