"చిన్నతనంలో భూమాను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారు.."

భూమా నాగిరెడ్డి ఐదేళ్ల పిల్లాడిగా ఉన్న సమయంలో ఆయన్ను కిడ్నాప్ చేయడానికి కొంతమంది యత్నించినట్లుగా ఎస్వీ ఆసక్తికర విషయం చెప్పారు.

అమరావతి: భూమా నాగిరెడ్డి మృతితో ఏపీ అసెంబ్లీలో మంగళవారం నాడు సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఉదయం సభ ప్రారంభమైన వెంటనే సీఎం చంద్రబాబు నాయుడు సభలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.

ఈ నేపథ్యంలో సభలో అధికారపార్టీ శాసనసభ్యులు, మంత్రులు భూమాతో తమ అనుబంధాన్ని, ఆయన రాజకీయ జీవితాన్ని గుర్తుచేసుకున్నారు. భూమా నాగిరెడ్డికి స్వయాన బావమరిది, కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి భూమా నాగిరెడ్డి గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. భూమా నాగిరెడ్డిది సున్నిత మనస్తత్వం అని పేర్కొన్నారు.

Somebody tried to kidnap MLA Bhuma Nagireddy in his childhood

భూమా పైకి గంభీరంగా కనిపించినా.. ఇంటికి వెళ్తే పిల్లలతో పాటు తాను చిన్నపిల్లాడిగా మారిపోయేవాడని ఎస్వీ మెహన్ రెడ్డి తెలిపారు. ఎప్పుడూ నంద్యాల అభివృద్ధి గురించే ఆయన ఆలోచించేవారని గుర్తుచేశారు. భూమా నాగిరెడ్డి ఐదేళ్ల పిల్లాడిగా ఉన్న సమయంలో ఆయన్ను కిడ్నాప్ చేయడానికి కొంతమంది యత్నించినట్లుగా ఎస్వీ ఆసక్తికర విషయం చెప్పారు.

1992లో నామినేషన్ వేయడానికి వెళ్తున్న సమయంలో భూమా కాన్వాయ్ పై బాంబులతో దాడి జరిగిందని తెలిపారు. అప్పట్లో చంద్రబాబు నాయుడు 10రోజుల పాటు ఆళ్లగడ్డలోనే ఉండి భూమా విజయానికి కృషి చేశారని గుర్తుచేశారు. ముగ్గురు అన్నదమ్ములను కోల్పోయినా.. భూమా ఆత్మస్థైర్యంతో బతికారని చెప్పారు.

చిన్నవయసులోనే తల్లిదండ్రులను కోల్పోయిన ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియను సొంత కూతురిలా చూసుకుంటానని చంద్రబబు చెప్పడం అభినందనీయం అన్నారు. చివరగా, భూమా ఆశయాలను నెరవేర్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సీఎంను కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+