వర్షాలతో చిక్కుకున్న సోమిరెడ్డి - 30 గంటల పాటు..!!
భారీ వర్షాలు..వరదల ధాటికి టీడీపీ నేత సోమిరెడ్డి వింత అనుభవం ఎదుర్కొన్నారు. నెల్లూరు నుంచి హైదరాబాద్ చేరుకోవటానికి సోమిరెడ్డికి 30 గంటల సమయం పట్టింది. వరదల కారణంగా రైల్వే ట్రాక్ లు దెబ్బ తిని పలు రైళ్లను దారి మళ్లించారు. రోడ్డు మార్గంలోనూ మళ్లింపులు చేసారు. దీంతో, సోమిరెడ్డి రైలులో నెల్లూరు నుంచి బయల్దేరి అనేక ఇబ్బందులు ఎదుర్కొని చివరకు కారులో హైదరాబాద్ కు చేరుకున్నారు. ఈ అనుభవాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు
సోమిరెడ్డి ప్రయాణం
నెల్లూరు నుంచి హైదరాబాద్ ప్రయాణంలో ఎప్పుడూ లేనటువంటి అనుభవాలను వర్షాలు, వరదల కారణంగా ఎదుర్కొన్నట్లు సోమిరెడ్డి చెప్పారు. రెండు రైళ్లతో పాటు మోటారు సైకిళ్లు, కార్లలో 30 గంటలు ప్రయాణించి హైదరాబాద్ చేరుకున్నానని వెల్లడించారు. శనివారం రాత్రి 7.15 గంటలకు నెల్లూరు నుంచి సింహపురి ఎక్స్ ప్రెస్ లో హైదరాబాద్ కు బయలుదేరానని... తెలంగాణలో కురిసిన భారీ వర్షాల కారణంగా రైల్వే ట్రాక్ కొట్టుకుపోవడంతో మహబూబాబాద్ రైల్వేస్టేషన్ లో ఆదివారం వేకువన 4 గంటలకు రైలును నిలిపేశారని చెప్పారు.

వరుస సమస్యలు
గంటల తరబడి వేచిచూసినా రైలు కదిలే పరిస్థితి లేక అక్కడే దిగిపోయి తన పాతమిత్రుడు, మాజీ మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావు గారికి సమాచారం ఇచ్చానన్నారు. ఆయన ద్వారా విషయం తెలుసుకున్న మహబూబాబాద్ లోని స్నేహితులు ఆతిథ్యమిచ్చారని చెప్పారు. అక్కడ మున్సిపల్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యేలతో పాటు తెలుగుదేశం, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల్లోని పాతమిత్రులతో చాలాసేపు గడిపానని వివరించారు. అనంతరం పద్మావతి ఎక్స్ ప్రెస్ లో 11 గంటలకు ఖమ్మంకు బయలుదేరితే మార్గమధ్యలోనే రైలు నిలిచిపోయిందన్నారు.
30 గంటల తరువాత
అక్కడి నుంచి కొంతదూరం మోటారు సైకిల్, మరికొంత దూరం కారులో ఖమ్మంకు 2.30 గంటలకు చేరుకున్నానని వివరించారు. 50 కిలోమీటర్ల దూరాన్ని ఒక గంటలో చేరుకోవాల్సివుండగా వరదల కారణంగా 3.30 గంటలకు పైగా పట్టిందని సోమిరెడ్డి చెప్పుకొచ్చారు. తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్యాంప్ ఆఫీసులో బస చేశానన్నారు. సాయంత్రం 5 గంటలకు తిరిగి కారులో హైదరాబాద్ కు బయలుదేరినట్లు వెల్లడించారు. వాగులు దాటేందుకు నా మిత్రుడు తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేకంగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారన్నారు. అందరి సహకారంతో ఆదివారం అర్ధరాత్రి 12 గంటలకు హైదరాబాద్ చేరుకున్నట్లు చెప్పారు.
-
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..












Click it and Unblock the Notifications