లోకేష్ బాబే మా డిప్యూటీ సీఎం- ఇది ఫిక్స్: టీడీపీ మైండ్ గేమ్
Nara Lokesh: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం ఇప్పుడిప్పుడే కుదురుకుంటోన్న ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త డిమాండ్ ఊపందుకుంటోంది.
రోజురోజుకూ అధికం..
చంద్రబాబు కేబినెట్‌లో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్‌ను ఉప ముఖ్యమంత్రిని చేయాలంటూ గళమెత్తే నాయకుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. టీడీపీకి చెందిన సీనియర్ నాయకులు కూడా ఇదే కోరుకుంటోన్నారు.

మహాసేనతో ఆరంభం..
నారా లోకేష్‌ను ఉప ముఖ్యమంత్రిని చేయాలనే డిమాండ్ తొలుత మహాసేన రాజేష్‌తో ఆరంభమైంది. లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయాలంటూ రాజేష్ డిమాండ్ చేశారు. భవిష్యత్ అవసరాల కోసం తప్పనిసరిగా ఈ దిశగా టీడీపీ అగ్ర నాయకత్వం ఖచ్చిత నిర్ణయాన్ని తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
పొలిట్ బ్యురో సభ్యుడి నోట..
ఇదే డిమాండ్- టీడీపీ అత్యున్నత నిర్ణయాత్మక విభాగం పొలిట్ బ్యురో సభ్యుడి నోట కూడా వెలువడటం ప్రాధాన్యతను సంతరించుకుంది. మైదుకూరులో పొలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డెప్పగారి శ్రీనివాస రెడ్డి కూడా ఇదే డిమాండ్‌ను లేవనెత్తారు. ఉప ముఖ్యమంత్రిగా లోకేష్‌ను ప్రమోట్ చేయడానికి ఇదే మంచి సమయమనీ వ్యాఖ్యానించారు. అటు పార్టీ, ఇటు ప్రభుత్వంలో లోకేష్ చేస్తోన్న కృషిని వివరించారు.
తాజాగా మాజీ మంత్రి..
ఇప్పుడు తాజాగా నెల్లూరు జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సైతం ఈ ప్రతిపాదనలను బలపరిచారు. ఈ డిమాండ్లను సమర్థించారు. పార్టీ సీనియర్ నేతగా తన అభిప్రాయాన్నీ వెల్లడించారు. నారా లోకేష్ వైపు మొగ్గు చూపారు.
అన్ని విధాలా అర్హుడు..
నారా లోకేష్ బాబును డిప్యూటీ సీఎం చేయాలన్న పొలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డెప్పగారి శ్రీనివాసులు రెడ్డి చేసిన ప్రతిపాదనను తాను సమర్థిస్తున్నానని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఆ పదవికి నారా లోకేష్ వంద శాతం అర్హుడని అన్నారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ బాబును డిప్యూటీ సీఎం చేయాలన్న పొలిట్ బ్యూరో సభ్యుడు ఆర్. శ్రీనివాసులు రెడ్డి ప్రతిపాదనను నేను సమర్థిస్తున్నాను. ఆ పదవికి @naralokesh వంద శాతం అర్హులే. రాజకీయంగా అనేక డక్కామొక్కిలు తిని, అవమానాలు… pic.twitter.com/swFgZEn6eq
— Somireddy Chandra Mohan Reddy (@Somireddycm) January 19, 2025
అనేక అవమానాలు..
నారా లోకేష్ రాజకీయంగా అనేక ఢక్కామొక్కిలు తిన్నాడని, ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడని సోమిరెడ్డి చెప్పారు. యువగళం పేరుతో పాదయాత్రను నిర్వహించాడని గుర్తు చేశారు. ఈ పాదయాత్రతో తనలోని నాయకత్వ లక్షణాలను నిరూపించుకున్నారని పేర్కొన్నారు.
పోరాట పటిమ..
నారా లోకేష్ బాబులో ఉన్న ఈ పోరాట పటిమను చూసి తెలుగుదేశం పార్టీ కేడర్‌తో పాటు రాష్ట్ర ప్రజానీకం కూడా ఆయనకు అండగా నిలిచారని, ఆయన నాయకత్వాన్ని జైకొట్టారని చెప్పారు. డిప్యూటీ సీఎం పదవికి అన్ని విధాల అర్హుడైన నారా లోకేష్ పేరును పరిశీలించాలని పార్టీని కోరుతున్నానని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications