జగన్ పనికొస్తాడనే: కాంగ్, సిబిఐపై సోమిరెడ్డి నిప్పులు

మధుకొడా ఉపయోగపడడు కాబట్టి మూడున్నరేళ్లుగా అతను జైల్లో ఉన్నారని, జగన్ ఉపయోగపడతాడని పదహారు నెలలకే బయటకు తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. జగన్ ఆస్తుల కేసులో మంత్రులను కాపాడుతూ కేసును నీరుగార్చే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.
అక్రమాస్తుల కేసు విచారణ పూర్తయిందన్న భావను కల్పించేలా సిబిఐ ప్రవర్తిస్తోందన్నారు. రాజకీయ లబ్ధి కోసం నేరస్తుడిని బయటకు తీసకు రావాలని చూడటం దారుణమన్నారు. ఎఫ్ఐఆర్‌లో పలు అంశాలను సిబిఐ వదిలేసిందన్నారు. ఎసిబి కేసులో జఫ్తు చేసిన తర్వాత విచారణ చేస్తారని, జగన్ ఆస్తుల కేసులో ఆయన సొంత ఆస్తులను ఎందుకు జఫ్తు చేయలేదని ప్రశ్నించారు.
సిబిఐ ఛార్జీషీట్లలో పొట్లూరి వరప్రసాద్ పేరును ఎందుకు చేర్చలేదో చెప్పాలన్నారు. పేదోడీ చిన్న దొంగతనం చేస్తే జైల్లో వేస్తారని, వేలకోట్లు దోచుకున్న జగన్‌ను వదిలేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. సండూరు పవర్ ప్రాజెక్టు పైన ఎందుకు అంత ప్రేమనో చెప్పాలన్నారు. ఆ అంశంపై ఎందుకు ఛార్జీషీట్ దాఖలు చేయలేదన్నారు. అత్యంత సంచలనం సృష్టించిన జగన్కేసులో ఆస్తులు జఫ్తు చేయక పోవడమేమిటన్నారు.












Click it and Unblock the Notifications