కేసీఆర్‌కు అది చేతకాదు : ఏపిలో మాత్రం వేలు పెడతారు : ఏపి మంత్రుల ఫైర్..!
తెలంగాణ ముఖ్యమంత్రి పైన ఏపి మంత్రి ఫైర్ అయ్యరు. ఏపి పాలనలో వేలు పెట్టాలని చూస్తున్న కేసీఆర్ తన రాష్ట్రంలో ఇంటర్ విద్యార్ధులు ప్రాణాలు తీసుకుంటుంటే ఆపటం చేతకాదని ఆరోపించారు. ఏపిలో ఎన్నికల సంఘం ..సీయస్ కలిసి ఏపిని పాలించాలని చూస్తున్నారని విమర్శించారు. వైసిపి నేతల మీద తీవ్ర వ్యాఖ్యలు చేసారు.
కేసీఆర్ అది చేతకాదు..
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన ఏపి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు. తెలంగాణలో ఇంటర్ విద్యార్థులు ప్రాణాలు తీసుకుంటుంటే ఆపడం చేతకాని కేసీఆర్.. ఏపీలో వేలుపెడుతున్నారని దుయ్యబట్టారు. ఏపీలో పరిపాలన సాగకూడదని కేసీఆర్ కోరుకుంటున్నారని ఆరోపించారు. ఏపీలో పరిపాలన స్తంభించిపోవాలని హైదరాబాద్ కేంద్రంగా కుట్రలు సాగుతున్నాయని మంత్రి సోమిరెడ్డి ఆరోపించారు. తెలంగాణలో ఇంటర్ ఫలితాల పైన గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. పలువురు విద్యార్ధులు ఇప్పటికే ఆత్మ హత్మ చేసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇంటర్ బోర్డు వద్ద ఆందోళనలు కొనసాగుతున్నాయి. వీటిని ఏపి మంత్రులు ప్రస్తావిస్తున్నారు.

ఎన్నికల సంఘం..సీయస్ కలిసి..
ఎన్నికల సంఘం..ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కలిసి ఏపిని పాలించాలని చూస్తున్నారంటూ మంత్రి సోమిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ఈసీని పెట్టుకుని వ్యవస్థల్ని దెబ్బతీయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. ఏపీలో ఉన్నది ఆపద్ధర్మ ప్రభుత్వం కాదని, చంద్రబాబు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కాదని మంత్రి సోమిరెడ్డి వివరించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉంటే విధానపరమైన నిర్ణయాలు మాత్రమే తీసుకోరాదన్నారు. వ్యవసాయ శాఖలో సమీక్షలు చేస్తే ఆనం కు అభ్యంతరమేంటని ప్రశ్నించారు. కనీస నిబంధనలు కూడా తెలియని ఆనం.. ఆర్థిక మంత్రిగా ఎలా పని చేశారో ఆశ్చర్యంగా ఉందని ఎద్దేవా చేశారు. ఆర్బీఐ రూల్స్ తెలియని వారు బాబుపై విమర్శలు చేస్తున్నారని మంత్రి సోమిరెడ్డి నిప్పులు చెరిగారు.












Click it and Unblock the Notifications