వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ సర్కారుపై పోరు, అధికారం దిశగా: పురంధేశ్వరి, సోము వీర్రాజు, సుజన, సీఎం రమేష్‌లకు షా క్లారిటీ

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై బీజేపీ పోరాడుతుందని ఆ పార్టీ నేతలు పురందేశ్వరీ, సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. సోమవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అనంతరం మీడియాతో వీరు మాట్లాడారు. బీజేపీ ప్రజావాణి కావాలని అమిత్ షా దిశా నిర్దేశం చేశారన్నారు.

ఏపీ సర్కారుపై పోరాటమన్న పురంధేశ్వరి

ఏపీ సర్కారుపై పోరాటమన్న పురంధేశ్వరి


ఏపీ విభజన బిల్లు అంశాలపై అమిత్ షాతో చర్చించామని పురంధేశ్వరి తెలిపారు. విభజన బిల్లులోని 80 శాతానికి పైగా అంశాలు ఇప్పటికే కేంద్రం నెరవేర్చిందని మిగిలిన అంశాలపై కూడా చర్చించామని ఆమె చెప్పారు. ఏపీలో ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగడంలేదని, దీనిపై కూడా పోరాటం చేస్తామని పురంధేశ్వరి అన్నారు. అమిత్‌షా పురందేశ్వరి భేటీ అనంతరం ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుతో కూడా చర్చలు జరిపారు.

2024లో అధికారం దిశగా బీజేపీ..: సోము వీర్రాజు

2024లో అధికారం దిశగా బీజేపీ..: సోము వీర్రాజు

అమిత్ షాతో భేటీ అనంతరం మీడియాతో సోము వీర్రాజు మాట్లాడారు. రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు బీజేపీ కృషి చేస్తుందన్నారు. ఏపీలో ప్రభుత్వ వ్యతిరేక వాతావరణం ఉండటంతో 2024లో అధికారం దిశగా అడుగులేయాలని, అమిత్ షా దిశా నిర్దేశం చేసినట్టు తెలిపారు. ఏపీలో ముఖ్యమైన నేతలను బీజేపీలో చేర్చుకుని 2024 లో ఏపీలో అధికారం దిశగా కార్యచరణ రూపొందించుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నామని సోము వీర్రాజు చెప్పారు. ఏపీలో గ్రామీణాభివృద్ధికి సహకారమందిస్తామని అమిత్ షా చెప్పారన్నారు. అనం తరం తిరుపతి పర్యటన ముగించుకున్న అమిత్‌ షా రేణిగుంట విమా నాశ్రయానికి చేరుకుని ప్రత్యేక విమానంలో ఢీల్లీ బయలుదేరి వెళ్లారు.

Recommended Video

Tirupati Bypoll : Vijay Sai Reddy కి బిజేపి స్ట్రాంగ్ కౌంటర్ !
సీఎం రమేష్, సుజనా చౌదరికి తేల్చి చెప్పిన అమిత్ షా

సీఎం రమేష్, సుజనా చౌదరికి తేల్చి చెప్పిన అమిత్ షా

అంతేగాక, ఏపీ కో-ఇంచార్జ్ సునీల్ దేవధర్, ఎంపీ జీవీఎల్‌కి ప్రత్యేకంగా ఆయన క్లాస్‌ పీకినట్టు సమాచారం. వైసీపీయే మన ప్రధాన శత్రువు... ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలని సూచించిన అమిత్ షా.. అమరావతే ఏపీ రాజధాని అన్నది బీజేపీ స్టాండ్‌.. రైతుల పాదయాత్రకు సంఘీభావం తెలపాలని సూచించినట్లు తెలిసింది. ఇక, జనసేన మన మిత్రపక్షం... కలిసి ముందుకు సాగండి అని సూచించారు. సుజనా చౌదరి, సీఎం రమేష్.. ఏపీ రాజకీయాలలో కీలక పాత్ర పోషించాలని స్పష్టం చేశారట. ఇక, విశాఖ స్టీల్ ప్లాంట్ పై ఏపీ ప్రజలకు ఇబ్బంది లేకుండా సమస్య పరిష్కారం చేసేలా చర్యలు తీసుకోనున్నట్టు షా చెప్పినట్టుగా తెలిసింది. మరోవైపు పొత్తులపై కూడా అమిత్‌షా క్లారిటీ ఇచ్చారు.. ప్రస్తుతం అధికార వైసీపీతో రాజకీయంగా రాష్ట్రంలో దూరం పాటిస్తున్న బీజేపీ... ఇదే సమయంలో టీడీపీ విషయంలోనూ సమానదూరం పాటించాలని తనను కలిసిన బీజేపీ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్‌లకు స్పష్టం చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా మూడు రోజుల పర్యటన నిమిత్తం శనివారం రాత్రి ఎపీకి చేరుకున్నారు. దక్షిణాది రాష్ట్రాల జోనల్ కౌన్సిల్ సమావేశం కోసం వచ్చిన ఆయనకు సీఎం వైఎస్‌ జగన్ స్వాగతం పలికారు. స్వర్ణభారతి ట్రస్టు 20వ వార్షికోత్సవం, ముప్పవరపు ఫౌండేషన్‌, 9వ సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో పాల్గొన్నారు. అంతకుముందు తిరుమల శ్రీవారిని కూడా ఆయన దర్శించుకున్నారు. అనంతరం బీజేపీ నేతలతో ఆయన భేటీ అయ్యారు. వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలని నేతలకు సూచించారు.

English summary
Somu Veerraju and Purandeswari slams AP govt after meeting with Amit Shah.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X