కష్టపడి ఒప్పించాం, హైదరాబాద్ మీదే: టిలో సోనియా

హైదరాబాద్: తెలంగాణ పైన అన్ని పార్టీలు యూ టర్న్ తీసుకున్నా కాంగ్రెసు పార్టీ వెనుకంజ వేయలేదని, హైదరాబాదు మీదేనని ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సభలో ఆదివారం అన్నారు. సంకీర్ణ ప్రభుత్వంలో ఏకాభిప్రాయం సాధించడం అంత సులువు కాదన్నారు. అందర్నీ ఒప్పించి తాము తెలంగాణ ఇవ్వగలిగామన్నారు. సామాజిక న్యాయమే కాంగ్రెసు పార్టీ లక్ష్యమని చెప్పారు. అట్టడుగు వర్గాల వారికి సంక్షేమ ఫలాలు అందాలని చెప్పారు. ఎన్నో సవాళ్లను ఎదుర్కొని కాంగ్రెసు పార్టీ తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిందని చెప్పారు. తెలంగాణ అమరవీరులకు తాను శ్రద్ధాంజలి ఘటిస్తున్నానని చెప్పారు.

తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది ప్రాణాలు అర్పించారన్నారు. ఆ తెలంగాణ బిల్లును పార్లమెంటులో నెగ్గించేందుకు తాము అన్ని పార్టీలను ఏకతాటి పైకి తీసుకు వచ్చామన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం కాంగ్రెసు పార్టీ ఎంతో కృషి చేసిందని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సమితికి స్వార్థపూరిత ప్రయోజనాలే ముఖ్యమన్నారు. కొందరు నాయకులు అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారని, వారికి సొంత ప్రయోజనాలు తప్ప ప్రజల సంక్షేమం పట్టదన్నారు.

Sonia Campaigns in Chevella

తెలంగాణ తొలి ప్రభుత్వం ఏ పార్టీ ఉండాలో ప్రజలు విచక్షణతో ఆలోచించి ఓటు వేయాలన్నారు. తెలంగాణ ప్రజల పోరాటం న్యాయమైందన్నారు. సామాజిక న్యాయం కోసమే తెలంగాణ ఏర్పాటు అన్నారు. ప్రజల ఆకాంక్ష గుర్తించి తాము తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణ ఏర్పాటులో ఇక్కడి ప్రజలే హీరోలు అన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం కాంగ్రెస్ బృహత్తర కార్యాచరణ రూపొందించిందన్నారు.

తెలంగాణ అభివృద్ధి కాంక్షించి కాంగ్రెసు పార్టీని గెలిపించాలన్నారు. తెలంగాణ అభివృద్ధిని కాంగ్రెసు పార్టీ కాంక్షిస్తోందన్నారు. తెలంగాణ ఆకాంక్ష అన్ని వర్గాల నుండి వ్యక్తమయిందని చెప్పారు. తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు తెలంగాణపై తమ వైఖరులు మార్చుకున్నా కాంగ్రెసు పార్టీ వెనుకంజ వేయలేదన్నారు. బడుగు, బలహీన, మైనార్టీల అభివృద్ధి కోసమే తెలంగాణ అన్నారు.

హైదరాబాదు మీదే!

రాష్ట్ర రాజధాని హైదరాబాదు తెలంగాణలో అంతర్భాగంగానే ఉంటుందని చెప్పారు. హైదరాబాదు సంపద అంతా తెలంగాణకే ఉంటుందన్నారు. ప్రాణహిత - చేవేళ్ల ప్రాజెక్టుకు, పాలమూరు ఎత్తిపోతలకు జాతీయ హోదాతో పాటు తెలంగాణ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందన్నారు.

హైదరాబాద్ ఆదాయం తెలంగాణకే చెందుతుందని స్పష్టం చేశారు. తెలంగాణలోని మిగతా ప్రాంతాలను హైదరాబాదులా అభివృద్ధి చేస్తామని చెప్పారు. తెలంగాణలో నాలుగువేల మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామన్నారు. స్వయం ఉపాధి కల్పిస్తామన్నారు. తెలగాణకు ట్యాక్స్ హాలీడే కల్పిస్తామని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+