సోనియాగాంధీ చంద్రబాబు కలిసే వైఎస్ఆర్ ను చంపేశారు: మళ్ళీ డిప్యూటీ సీఎం షాకింగ్ వ్యాఖ్యలు
తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామిపై హైదరాబాద్లోని బేగంబజార్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిన ఘటన నేపథ్యంలో ఆయన మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఎప్పుడూ తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తుంటారు. కొన్నిసార్లు సొంత పార్టీ నేతలు, మరికొన్నిసార్లు విపక్షాలను టార్గెట్ చేసే ఆయన తాజాగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఇక ఈ వ్యాఖ్యలను తెలంగాణ కాంగ్రెస్ నేతలు చాలా సీరియస్ గా తీసుకున్నారు. హైదరాబాద్ బేగంబజార్ లోని పోలీస్ స్టేషన్లో మల్లు రవి ఆయనపైన ఫిర్యాదు చేశారు. సోనియా గాంధీ పై అసత్యాలు, అవాస్తవాలు మాట్లాడిన నారాయణస్వామి పై కేసు నమోదు చేసి తీసుకోవాలంటూ చర్యలు తీసుకోవాలంటూ ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అయితే తాజాగా తనపై కాంగ్రెస్ నేతల ఫిర్యాదుపై ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు.. సోనియాగాంధీ, చంద్రబాబు కలిసి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని హెలికాఫ్టర్ ప్రమాదంలో చంపారని రాష్ట్ర ప్రజలలో సందేహం ఉందని ఆయన అన్నారు. వాళ్ళిద్దరూ కలిసి వైఎస్ ను చంపారని ప్రజలందరికీ తెలుసు అంటూ మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆ సందేహాన్ని తీర్చే శక్తి సోనియాగాంధీకి, చంద్రబాబుకు లేదని ఆయన పేర్కొన్న ఆయన చంద్రబాబుకు రాజకీయ భిక్ష పెట్టింది రాజశేఖర్ రెడ్డి అని తేల్చి చెప్పారు. ఏ తప్పు చేయని వ్యక్తి, ఎవరికీ భయపడినటువంటి వ్యక్తి వైఎస్ జగన్ ను అన్యాయంగా కేసుల్లో ఇరికించారని, 16 నెలల పాటు జైల్లో పెట్టారని ఆరోపణలు గుప్పించారు.
మరి అప్పుడు మీ నోర్లు ఎక్కడికి పోయాయంటూ కాంగ్రెస్ నేతలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చంద్రబాబు మనిషని, రేవంత్ రెడ్డి గెలవడానికి చంద్రబాబు డబ్బులు పంపించారని ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి తీవ్ర విమర్శలు గుప్పించారు. తాను చేసిన వ్యాఖ్యలను మళ్లీ సమర్థించుకునే ప్రయత్నం చేశారు.












Click it and Unblock the Notifications