నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తండ్రిని శ్మశానంలో వదిలేసిన కొడుకు: తల్లికి కొడుకుల హెచ్చరిక

By Pratap
|
Google Oneindia TeluguNews

విజయవాడ: తమను కనిపెంచిన కనికరం కూడా లేకుండా తల్లిదండ్రుల పట్ల అత్యంత దారుణంగా వ్యవహరించిన రెండు సంఘటనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెలుగు చూశాయి. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో ఓ కొడుకు తండ్రి బతికుండగానే శ్మశానంలో వదిలివేశాడు. నెల్లూరు జిల్లాలో కన్నకొడులు 72 గంటల్లో ఇంటిని ఖాళీ చేసి వెళ్లిపోవాలని తల్లిని ఆదేశించారు.

పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో ఏడు పదుల వయసులో కదలలేని స్థితిలో ఉన్న ఆ తండ్రిని వదిలించుకునేందుకు కన్నకొడుకు సిద్ధపడ్డాడు. ఇందుకోసం బతికున్న తండ్రిని శ్మశానంలో వదిలేశాడు. శ్మశానంలో వదిలేసి వస్తూ ఆయన చస్తే పూడ్చిపెట్టండి అంటూ అక్కడి కాటికాపరులకు చెప్పేసి మరీ వచ్చాడు. మూడు రోజులుగా శ్మశాసంలో తండ్రి శ్మశానంలోనే పడి ఉన్నాడు.

Sons leaves father burial ground in West Godavari

ఇక, నెల్లూరు పట్టణం జనార్ధన్ రెడ్డి కాలనీలో కన్న తల్లికే కన్నబిడ్డలు 72 గంటల అల్టిమేటం ఇచ్చారు. నరసింహాచార్యులు, ఆండాలమ్మ అనే దంపతులకు ముగ్గురు కుమారులు. కొడుకులు వివిధ రకాలుగా స్థిరపడిపోయారు. అదేసమయంలో భర్త కూడా చనిపోవడంతో తన సొంత ఇంటిలో ప్రభుత్వం ఇచ్చే ఫించనుతో ఆండాలమ్మ జీవిస్తోంది.

అయితే, ఆమె నివసిస్తున్న ఇంటిపై మూడో కుమారుడు సత్యనారాయణా చార్యులు కన్నుపడింది. దాంతో 72 గంటల్లో ఇంటిని ఖాళీ చేసి వెళ్లిపోవాలంటూ తల్లికి అల్టిమేటం జారీ చేశాడు. ఆయనకు రెండో రెండో కుమారుడు కూడా వత్తాసు పలికాడు. దీంతో ఆ వృద్ధురాలు పోలీసులను ఆశ్రయించింది. ఈ ఇంటి పట్టా తనపేరు మీదవుందనీ, ఈ వయస్సులో తాను ఎక్కడికి వెళ్లేది లేదని విలపిస్తోంది.

ఈమె పెద్ద కొడుకు ఢిల్లీలో ఓ బ్యాంకులో పని చేస్తుండగా, రెండో కుమారుడు వ్యాపారం చేస్తున్నాడు. మూడో కుమారుడు గుడిలో పూజరిగా కొనసాగుతున్నాడు. ఆండాలమ్మ ప్రస్తుతం నడవలేని స్థితిలో ఉంది. రెండేళ్ళ క్రితం జారి కిందపడటంతో ఆమె కాలు, చెయ్యి విరిగి మంచానికే పరిమితమైంది.

English summary
A man in West Godavari district left his father in burial ground.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X