కాకినాడ, విశాఖపట్నం, మచిలీపట్నం ప్రజలకు శుభవార్త
రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు శుభవార్త చెప్పారు. 12 ఎక్స్ ప్రెస్ రైళ్లకు ఒక్కో రైలుకు రెండు అదనపు జనరల్ బోగీలను ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్ నుంచి బయలుదేరే రైళ్లు ప్రతిరోజు కిక్కిరిసి నడుస్తున్నాయి. కనీసం మూడు నెలలముందు రిజర్వేషన్ చేయించుకుంటేకానీ దొరకడంలేదు. జనరల్ బోగీలో ప్రయాణిద్దామంటే కేవలం ముందు ఒక బోగీ, వెనక ఒక బోగీ మాత్రమే ఉంటాయి. వీటిల్లో ప్రయాణికులు స్థలం లేక మరుగుదొడ్లలో కూడా కిక్కిరిసి ప్రయాణిస్తున్నారు. దీనిపై విమర్శలు వస్తుంటే ఎట్టకేలకు అధికారులు స్పందించి అదనపు బోగీలు ఏర్పాటు చేశారు.
ఏయే రైళ్లకు అదనపు బోగీలు ఏర్పాటు చేశారంటే
సికింద్రాబాద్ - గూడూరు - సికింద్రాబాద్ సింహపురి ఎక్స్‌ప్రెస్ (12709/12710)
సికింద్రాబాద్ హౌరా సికింద్రాబాద్ ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ (12703/12704)
హైదరాబాద్ విశాఖపట్నం హైదరాబాద్ మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్ (12727)
కాకినాడ పోర్ట్ లింగంపల్లి కాకినాడ పోర్ట్ (12737/12738)
కాకినాడ పోర్టు భావనగర్ కాకినాడ పోర్ట్ (12755/12756)

కాకినాడ పోర్ట్ సాయినగర్ షిర్డీ కాకినాడ పోర్ట్ (17205/17206)
హైదరాబాద్ తాంబరం హైదరాబాద్ ఛార్మినార్ ఎక్స్‌ప్రెస్ (12759/12760)
కాకినాడ పోర్ట్ లింగంపల్లి కాకినాడ పోర్ట్ (12775/12776)
సికింద్రాబాద్ భువనేశ్వర్ సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ (17015/17016)
మచిలీపట్నం యశ్వంత్‌పూర్ మచిలీపట్నం కొండవీడు ఎక్స్‌ప్రెస్ (17211/17212)
మచిలీపట్నం ధర్మవరం మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్ (17215/17216)
కాకినాడ పోర్ట్ లోకమాన్య తిలక్ కాకినాడ పోర్ట్ (17221/17222)
విజయవాడ- భద్రాచలం రోడ్ మధ్య నడిచే 07278/07279 నెంబరు రైళ్లను సికింద్రాబాద్ డివిజన్ లో పనులు జరుగుతుండటంతో రద్దు చేశారు. తాజాగా ఈ రైలును శనివారం నుంచి పునరుద్ధరించారు. .












Click it and Unblock the Notifications