వీకెండ్లో హైదరాబాద్ టూ కాకినాడ, నర్సాపూర్ వెళ్తున్నారా ? ఇది మీకోసమే..!

హైదరాబాద్ నుంచి ఏపీలోని కాకినాడ, నరసాపురానికి వెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. ముఖ్యంగా వారాంతంలో ప్రయాణాలు చేసే వారికి ఇది ఉపయోగపడనుంది. హైదరాబాద్ నుంచి వీకెండ్ లో ఏపీలో సొంతూళ్లకు
వెళ్లే సాఫ్ట్ వేర్, ఇతర ఉద్యోగులు, సాధారణ ప్రయాణికుల కోసం దక్షిణ మధ్య రైల్వే నాలుగు ప్రత్యేక రైళ్లను వివిధ తేదీల్లో నడపనుంది. వీటి వివరాలను అధికారులు ప్రకటించారు.

చర్లపల్లి నుంచి కాకినాడ టౌన్, కాకినాడ టౌన్ నుంచి చర్లపల్లి, అలాగే చర్లపల్లి నుంచి నరసాపూర్, నరసాపూర్ నుంచి చర్లపల్లి మధ్య ఈ ప్రత్యేక రైళ్లు మార్చి నెలలో వారాంతపు రోజుల్లో రాకపోకలు సాగించబోతున్నాయి. ఇందులో 07031 నంబర్ ట్రైన్
ఈ నెల 28, మార్చి 7, 13, 21, 28 తేదీల్లో చర్లపల్లిలో రాత్రి 7.20కి బయలుదేరి మరుసటి రోజు తెల్లవారుజామున 4.30కి కాకినాడ టౌన్ కు చేరుకోనుంది.

south central railway announces special weekend trains from Hyderabad to Kakinada and narsapur

అలాగే 07032 రైలు మార్చి 2,9, 16,23, 31 తేదీల్లో కాకినాడలో సాయంత్రం 6.55కు బయలుదేరే రైళ్లు ఆ మరుసటి రోజు ఉదయం 6.50కి చర్లపల్లి స్టేషన్ కు చేరుకుంటాయి. 07233 నంబర్ రైలు చర్లపల్లిలో ఈ నెల 28, మార్చి 7, 13, 21, 28 తేదీల్లో
రాత్రి 8.15కి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.50కి నరసాపూర్ చేరుకుంటుంది. అలాగే 07234 రైలు నరసాపూర్ లో మార్చి 2, 9,16,23,31 తేదీల్లో రాత్రి 8 గంటలకు బయలుదేరే రైళ్లు మరుసటి రోజు ఉదయం 6 గంటలకు చర్లపల్లికి చేరుకుంటాయి.

చర్లపల్లి-కాకినాడ మధ్య ప్రత్యేక రైలుకు నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట స్టేషన్లలో రెండు వైపులా ఆగేలా స్టాప్ ఇచ్చారు. అలాగే చర్లపల్లి-నరసాపూర్ మధ్య రాకపోకలు సాగించే రైళ్లకు నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట స్టేషన్లలో రెండు వైపులా స్టాప్ లు ఇచ్చారు. అలాగే ఈ ప్రత్యేక రైళ్లలో 2AC, 3AC, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+