అలర్ట్: ఏపీలో రైళ్లను రద్దు చేసిన అధికారులు
గుంటూరు మీదగా వివిధ ప్రాంతాలకు వెళ్లే పలు రైళ్లను అధికారులు రద్దుచేశారు. ఈ నెల 15 నుంచి 26 వరకూ ఈ రద్దు వర్తించనుంది. విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో భద్రతా పరమైన పనులు జరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. సిగ్నలింగ్ వ్యవస్థను ఆధునికీకరిస్తున్నారు.
నరసాపురం- విజయవాడ (17270/07862),
నరసాపురం- రాజమహేంద్రవరం (07883/07884),
నరసాపురం- నిడదవోలు (07897/07771) రైళ్లు రద్దయ్యాయి.
రామవరప్పాడు- నరసాపురం (07861) రైలు భీమవరం జంక్షన్ వరకే నడుస్తుంది.

విశాఖపట్నం-గుంటూరు (22701/22702/17239)
రాజమహేంద్రవరం-విజయవాడ (07466/07467)
ఈ నెల 16 నుంచి 31 వరకు హుబ్లీ-విజయవాడ (17329), ఈనెల 16 నుంచి 27వ తేదీ వరకు విశాఖపట్నం-గుంటూరు (17240).. అలాగే ఈ నెల 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు నర్సాపురం-గుంటూరు (17282) రైళ్లను, ఈనెల 17 నుంచి జూన్ 1 వరకు గుంటూరు-నర్సాపురం (17281) రైలును రద్దు చేశారు. ఈ నెల 17 నుంచి జూన్ 1 వరకు విజయవాడ-హుబ్లీ (17330) రైలును కూడా పూర్తిగా రద్దు చేశారు.
ఒడిసాలోని బాలసోర్ వద్ద జరిగిన కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ప్రమాదంలో 300కు పైగా ప్రయాణికులు మరణించిన సంగతి తెలిసిందే. మరోసారి ఇటువంటి ఘటన తలెత్తకుండా ఉండేందుకు దేశవ్యాప్తంగా ఉన్న సిగ్నలింగ్ వ్యవస్థను అధికారులు ఆధునికీకరిస్తున్నారు. ఇందులో భాగంగా విజయవాడ డివిజన్ లో పనులు జరుగుతున్నాయి. వీటితోపాటు విజయవాడ-గూడూరు, విజయవాడ-విశాఖపట్నం మధ్య మూడోలైను నిర్మాణ పనులు కూడా జరగనున్నాయి.












Click it and Unblock the Notifications