సికింద్రాబాద్, విశాఖపట్నం, తిరుపతివారికి ముఖ్య గమనిక
దక్షిణమధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. సెలవులు ముగుస్తుండటంతో రద్దీ పెరుగుతుందనే ఉద్దేశంతో ఇప్పటికే నడుస్తున్న కొన్ని ప్రత్యేక రైళ్లను అధికారులు పొడిగించారు. విశాఖపట్నం-సికింద్రాబాద్, విశాఖపట్నం-మహబూబ్‌నగర్, విశాఖపట్నం-తిరుపతి, భువనేశ్వర్-తిరుపతి మార్గాల్లో ఇవి నడవనున్నాయి. వాటి టైమింగ్స్, ఆగే స్టేషన్ల వివరాలు తెలుసుకుందాం.
విశాఖపట్నం-సికింద్రాబాద్ వీక్లీ స్పెషల్ ట్రైన్
నెంబర్ 08579 విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వరకు. జులై 5 నుంచి జులై 26 వరకు పొడిగించారు. ప్రతి బుధవారం రాత్రి 7.00 గంటలకు వైజాగ్ లో బయలుదేరి తర్వాతరోజు ఉదయం 9.05 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.

సికింద్రాబాద్-విశాఖపట్నం వీక్లీ స్పెషల్ ట్రైన్
నెంబర్ 08580 సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వరకు. జులై 6వ తేదీ నుంచి 27వ తేదీ వరకు పొడిగించారు. ప్రతి గురువారం రాత్రి 7.40 గంటలకు సికింద్రాబాద్ లో బయలుదేరి తర్వాత రోజు ఉదయం 9.15 గంటలకు విశాఖ చేరుకుంటుంది. నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూరు, భీమవరం, తణుకు, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, అనకాపల్లి, దువ్వాడ స్టేషన్లలో ఆగుతాయి.
విశాఖపట్నం-మహబూబ్‌నగర్ వీక్లీ స్పెషల్ ట్రైన్
నెంబర్ 08585 విశాఖపట్నం నుంచి మహబూబ్‌నగర్ వరకు. జులై 4 నుంచి జులై 25 వరకు పొడిగించారు. ప్రతి మంగళవారం సాయంత్రం 5.35 గంటలకు విశాఖపట్నంలో బయల్దేరి తర్వాత రోజు ఉదయం 10.30 గంటలకు మహబూబ్‌నగర్ చేరుకుంటుంది.
మహబ్‌నగర్-విశాఖపట్నం వీక్లీ స్పెషల్ ట్రైన్
నెంబర్ 08586 మహబూబ్‌నగర్ నుంచి విశాఖపట్నం వరకు. జులై 5 నుంచి జులై 26వ తేదీ వరకు పొడిగించారు. ప్రతి బుధవారం సాయంత్రం 6.20 గంటలకు మహబూబ్‌నగర్‌లో బయల్దేరి తర్వాతరోజు ఉదయం 9.50 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. దువ్వాడ, అన్నవరం సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లె, మిర్యాలగూడ, నల్గొండ, మల్కాజిగిరి, కాచిగూడ, ఉందానగర్, షాద్‌నగర్, జడ్చర్ల స్టేషన్లలో ఆగుతాయి.
విశాఖపట్నం-తిరుపతి వీక్లీ స్పెషల్ ట్రైన్
నెంబర్ 08583 విశాఖపట్నం నుంచి తిరుపతి వరకు. జులై 3 నుంచి జులై 31 వరకు పొడిగించారు. ప్రతి సోమవారం రాత్రి 7.00 గంటలకు విశాఖపట్నంలో బయల్దేరి తర్వాతరోజు ఉదయం 9.15 గంటలకు తిరుపతి చేరుకుంటుంది.

తిరుపతి-విశాఖపట్నం వీక్లీ స్పెషల్ ట్రైన్
నెంబర్ 08584 తిరుపతి నుంచి విశాఖపట్నం వరకు. జులై 4 నుంచి ఆగస్ట్ 1వ తేదీ వరకు పొడిగించారు. ప్రతి మంగళవారం రాత్రి 9.55 గంటలకు తిరుపతిలో బయల్దేరి తర్వాతరోజు ఉదయం 10.15 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. దువ్వాడ, అనకాపల్లి, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు , గూడూరు, శ్రీకాళహస్తి, రేణిగుంట స్టేషన్లలో ఆగుతాయి.
భువనేశ్వర్-తిరుపతి వీక్లీ స్పెషల్ ట్రైన్
నెంబర్ 02809 భువనేశ్వర్ నుంచి తిరుపతి వరకు. జులై 1 నుంచి జులై 29 వరకు పొడిగించారు. ప్రతి శనివారం మధ్యాహ్నం 1.30 గంటలకు భువనేశ్వర్‌లో బయల్దేరి తర్వాత రోజు ఉదయం 10.30 గంటలకు తిరుపతి చేరుకుంటుంది.
తిరుపతి-భువనేశ్వర్ వీక్లీ స్పెషల్ ట్రైన్
నెంబర్ 02810 తిరుపతి నుంచి భువనేశ్వర్ వరకు. జులై 2 నుంచి జులై 30 వరకు పొడిగించారు. ప్రతి ఆదివారం రాత్రి 8.15 గంటలకు తిరుపతిలో బయల్దేరి తర్వాతరోజు సాయంత్రం 5.25 గంటలకు భువనేశ్వర్ చేరుకుంటుంది. ఖుర్దారోడ్, బలుగాన్, బ్రహ్మాపూర్, పలాస, శ్రీకాకుళం, విజయనగరం, దువ్వాడ, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తణుకు, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, ఒంగోలు, గుడ్డూరు, నెల్లూరు, గూడూరు రేణిగుంట రైల్వే స్టేషన్లలో ఆగుతాయి.












Click it and Unblock the Notifications