శుభవార్త వినిపించిన దక్షిణ మధ్య రైల్వే
ప్రయాణికుల సౌలభ్యం కోసం దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఎనిమిది ఎక్స్ ప్రెస్ రైళ్లకు అదనపు హాల్టులను కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ముందు ప్రయోగాత్మకంగా కొత్తగా ఏర్పాటు చేసిన స్టేషన్లలో రైళ్లను ఆపుతారు. సికింద్రాబాద్-రామనాథపురం-సికింద్రాబాద్ మధ్య రాకపోకలు సాగించే రైలు (07695, 07696)కు ముటుపేట్ వద్ద, హౌరా-పుదుచ్చేరి-హౌరా (12867, 12868) రైలుకు తిరువణ్నామలై వద్ద, ముంబయి సీఎస్ఎంటీ-నాగర్ కోయిల్- ముంబయి సీఎస్ఎంటీ మధ్య రాకపోకలు సాగించే (16339, 16340) రైలు కొడైకెనాల్, ముంబయి సీఎస్ఎంటీ-నాగర్ కోయిల్- ముంబయి సీఎస్ఎంటీ (16351, 16352)నంగునేరి వద్ద ఆగనున్నాయి. సెప్టెంబరు 13వ తేదీ నుంచి ఈ హాల్టుల్లో ప్రయాణికులకు సర్వీసు సేవలందనున్నాయి.
మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రయాణికులను ఆకట్టుకోవడానికి భారతీయ రైల్వే అత్యాధునిక సౌకర్యాలతో కూడిన రైళ్లను అందుబాటులోకి తెస్తోంది. ఇందులో భాగంగా సెమీ హైస్పీడ్ రైళ్లయిన వందే భారత్ ను దేశవ్యాప్తంగా 25 మార్గాల్లో పట్టాలెక్కించింది. తాజాగా చెన్నైలోని ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ నుంచి మరో 9 వందే భారత్ రైళ్లు బయటకు వచ్చాయి. వీటిని ఒక్కో జోన్ కు ఒక్కోరైలు చొప్పున కేటాయించనున్నారు. దేశంలోని ప్రధాన నగరాల మధ్య రాకపోకలు అతి తక్కువ సమయంలో పూర్తికావాలనే లక్ష్యంతో వీటిని ప్రవేశపెట్టారు. గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సామర్థ్యం ఉన్నప్పటికీ రైలు పట్టాల సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకొని గంటకు 130 కిలోమీటర్ల వేగంతో నడుపుతున్నారు.













Click it and Unblock the Notifications