సంక్రాంతికి మరో ఆరు ప్రత్యేక రైళ్లు: ఈ మార్గాల్లోనే, ఎప్పట్నుంచంటే?
సంక్రాంతి (Sankranti)కి ఊరేళ్లే తెలుగు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తెలుగు రాష్ట్రాల మధ్య సౌత్ సెంట్రల్ రైల్వే ఇప్పటికే కొన్ని ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. తాజాగా, మరో ఆరు రైళ్లను ప్రకటించింది. ఈ రైళ్లు సికింద్రాబాద్, తిరుపతి, కాకినాడ నగరాల మధ్య జనవరి 10 నుంచి 15 తేదీల్లో సర్వీసులందించనున్నాయి.
తిరుపతి- సికింద్రాబాద్ ప్రత్యేక రైలు (07055) జనవరి 10వ తేదీన రాత్రి 8.25 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 9.10 గంటలకు గమ్యస్థానానికి చేరుకోనుంది.

సికింద్రాబాద్ -కాకినాడ టౌన్ రౌలు (07056) జనవరి 11వ తేదీన రాత్రి 7 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయాన్నే 6.45 గంటలకు కాకినాడకు చేరుకుంటుంది. ఇక, కాకినాడ టౌన్ - సికింద్రాబాద్ ప్రత్యేక రైలు (07057) 12వ తేదీ రాత్రి 9 గంటలకు కాకినాడలో బయల్దేరి మరుసటి రోజు ఉదయం 8.30 గంటలకు సికింద్రాబాద్ చేరుకోనుంది.
సికింద్రాబాద్ - కాకినాడ టౌన్ ప్రత్యేక రైలు (07071) జనవరి 13వ తేదీన రాత్రి 9 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 8.30 గంటలకు కాకినాడ టౌన్‌కు చేరుకుంటుంది.
కాకినాడ టౌన్ - తిరుపతి ప్రత్యేక రైలు (07072) జనవరి 14న ఉదయం 10 గంటలకు బయల్దేరి అదే రోజు రాత్రి 8.20 గంటలకు తిరుపతి చేరుకుంటుంది.
తిరుపతి - కాచిగూడ ప్రత్యేక రైలు (02707) జనవరి 15న తెల్లవారుజామున 5.30 గంటలకు బయల్దేరి అదే రోజు సాయంత్రం 5 గంటలకు కాచిగూడకు చేరుకోనుంది. కాగా, ఇప్పటికే సంక్రాంతి కోసం 32 ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications