Special Train: ఏపీ ప్రజలకు శుభవార్త.. ఈ ఎన్నికలకు ప్రత్యేక రైళ్లు..
తెలుగు రాష్ట్రాల్లో మే 13 ఎన్నికల పోలింగ్ జరగనుంది. తెలంగాణలో కేవలం లోక్ సభ ఎన్నికలు జరుగుతుండగా.. ఏపీలో మాత్రం లోక్ సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతోన్నాయి. అయితే ఏపీకి చెందిన చాలా మంది హైదరాబాద్ లో ఉన్నారు. కొంత మందికి ఇక్కడే ఓటు రాగా.. చాలా మంది ఏపీలోనే ఓట్లు ఉన్నాయి. హైదరాబాద్ లో ఏపీకి చెందిన ఓటర్లు దాదాపు 30 లక్షల మంది ఉంటారని తెలుస్తోంది. ఈ 30 లక్షల ఓట్లు అక్కడి పార్టీలకు కీలకం.
అందుకే హైదరాబాద్ నుంచి ఓటర్లను రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే చాలా మంది ఓటర్లు స్వచ్ఛందంగా వెళ్లి ఓటు వేయడానికి సిద్ధమయ్యారు. అలాంటి వారికి దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెపిపింది. ఏపీలో ఎన్నికల నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగను న్న నేపథ్యంలో కీలక నిర్ణ యం తీసుకుంది. ఈ నెల 13, 14 వ తేదీల్లో రెండు రోజులు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు తెలిపింది.

13, 14 తేదీల్లో సికిం ద్రాబాద్-కాకినాడ, కాకినా డ-సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైలు సర్వీసులను నడపనున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే ఓ ప్రకటనలో వివరించింది. లోక్‌సభ ఎన్నికల్లో 4వ విడతలో భాగంగా ఏపీ, తెలంగాణలో పోలింగ్ జరగనుంది. అలాగే ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కూడా అదే రోజు జరగనుంది. ఏపీకి చెందిన చాలా మంది ఓటర్లు హైదరాబా ద్‌తో పాటు.. తెలంగాణలో ని పలు చోట్ల ఉన్నారు. దీంతో వారి ప్రయాణ అవసరాలను దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే ఈ నిర్ణ యం తీసుకుంది.
ప్రయా ణికుల రద్దీ పెరిగే అవకాశం ఉన్నందున.. సికింద్రాబా ద్-కాకినాడ స్పెషల్ ట్రైన్స్ నడిపేందుకు సిద్ధమైంది. అటు పార్టీలు కూడా ఓటర్ల నొప్పించేందుకు ప్రైవేట్ వాహనాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఓటర్లు ఆంధ్రకు వెళ్లే మే 13 హైదరాబాద్ రోడ్లు ఖాళీగా దర్శనం ఇచ్చే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications