Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ప్రత్యేక హోదా హామీ నెరవేర్చలేదు - ఏ హామీ అమలు కాలేదు..అది ఉల్లంఘనే : అమిత్ షా సమక్షంలో సీఎం జగన్ ..!!

విభజనతో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని..రాష్ట్రాన్ని విడగొట్టి ఏడేళ్లు గడిచినా హామీలు అమలు కావడంలేదంటూ ఏపీ ముఖ్యమంత్రి జగన్ సమస్యలను ఏకరువు పెట్టారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన జరుగుతున్న దక్షిణాది రాష్ట్రాల సమావేశంలో ఆయన రాష్ట్ర సమస్యలను ప్రస్తావించారు. రాష్ట్రాల మధ్య సమస్యలు నిర్దేశిత సమయంలోగా పరిష్కారం కావాలని సూచించారు.దీనికోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని సీఎం కోరారు. విభజన సమయంలో వచ్చిన సమస్యలన్నీ అపరిష్కృతంగానే ఉన్నాయని..వాటితో రాష్ట్రాని తీవ్ర నష్టం జరుగుతోందని అంకెలతో సహా వివరించారు.

విభజన చట్టాన్ని ఉల్లంఘించడమే

విభజన చట్టాన్ని ఉల్లంఘించడమే


పోలవరం ప్రాజెక్టు వ్యయ నిర్ధారణలో 2013-14 ధరల సూచీతో రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని అమిత్ షా కు వివరించారు. ఇలా చేయటమంటే..విభజన చట్టాన్ని ఉల్లంఘించడమేనని స్పష్టంగా చెప్పుకొచ్చారు. రీసోర్స్‌ గ్యాప్‌నూ భర్తీచేయలేదన్నారు. ఇదే సమావేశంలో ప్రత్యేక హోదా హామీని నెరవేర్చలేదంటూ మరోసారి తన డిమాండ్ వినిపించారు. తెలంగాణ నుంచి విద్యుత్‌ బకాయిలను ఇప్పించండని కోరారు.తీవ్ర కష్టాల్లో ఉన్న ఏపీ డిస్కంలకు ఊరట నివ్వండని అభ్యర్ధించారు. రెండు రాష్ట్రాల మధ్య ఆస్తుల పంపిణీ కూడా జరగలేదని వివరించారు.

విభజన కష్టాలను వివరించిన సీఎం జగన్

విభజన కష్టాలను వివరించిన సీఎం జగన్

గత ప్రభుత్వంలో పరిమితి దాటారని రుణాలపై ఇప్పుడు కోత విధిస్తున్నారని..దీనిపై వెంటనే జోక్యం చేసుకోవాలని సీఎం జగన్ కోరారు. రాష్ట్రాల్లో రేషన్‌ లబ్ధిదారుల గుర్తింపుకోసం కేంద్ర ప్రభుత్వ ప్రక్రియలో హేతుబద్ధత లేదని..వెంటనే సరవణలు చేయాలని జగన్ సూచించారు. విభజన వల్ల ఆంధ్రప్రదేశ్‌ ఎంతో నష్టపోయింది. రాష్ట్ర విభజన తర్వాత, తొలి ఆర్థిక సంవత్సరం 2015-16లో.. తెలంగాణలో తలసరి ఆదాయం రూ.15,454 కాగా, ఆంధ్రప్రదేశ్‌లో తలసరి ఆదాయం కేవలం రూ.8,979 మాత్రమే. విభజన వల్ల ఆంధ్రప్రదేశ్‌ ఏ స్థాయిలో నష్టపోయింది అని చెప్పడానికి ఇది ఒక స్పష్టమైన ఉదాహరణగా పేర్కొన్నారు.

ఏ ఒక్క హామీ అమలు కాలేదు

ఏ ఒక్క హామీ అమలు కాలేదు

పార్లమెంటులో రాష్ట్ర పునర్విభజన బిల్లు-2014 ఆమోదం సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కు పలు హామీలు ఇవ్వడం జరిగింది. కానీ వాటిని నెరవేర్చలేదు. రాష్ట్ర విభజన జరిగి ఏడేళ్లు పూరైనా ఇప్పటికీ అనేక హామీలను అమలు చేయకపోవడంతో, ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికంగా ఎంతో నష్టపోవడమే కాకుండా అనేక సమస్యలను ఎదుర్కొంటోందని సీఎం జగన్ వివరించారు. పోలవరం ప్రాజెక్టు భవిష్యత్తును ప్రమాదంలో పడవేసే పరిస్థితి కనిపిస్తోంది. అందువల్ల పెరిగిన ప్రాజెక్టు వ్యయానికి అనుగుణంగా నిధులు మంజూరు చేస్తూ, 2014 రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యచే పూర్తి నిధులను కేంద్రం మంజూరు చేసి, విడుదల చేయాలని విజ్ఞప్తి చేసారు. రాష్ట్ర మొత్తం రెవెన్యూ లోటు (రీసోర్స్‌ గ్యాప్‌) ఏకంగా రూ.22,948.76 కోట్లకు చేరుకుందని చెప్పారు.

డిస్కింలకు బకాయిలు చెల్లించాల్సి ఉంది

డిస్కింలకు బకాయిలు చెల్లించాల్సి ఉంది

కేంద్ర ప్రభుత్వం కొత్తగా 'ప్రామాణిక వ్యయం' (స్టాండడైజ్జ్‌ ఎక్స్‌పెండీచర్‌) అన్న విధానాన్ని తీసుకువచ్చింది. ఆ మేరకు ఆంధ్రప్రదేశ్‌కు కేవలం రూ.4,117.89 కోట్ల లోటు మాత్రమే పూడ్చగలమని తెలియజేసింది. దీంతో కేంద్రం నాడు ఇచ్చిన హామీని నెరవేర్చకపోవడం వల్ల ఆ లోటు అలాగే మిగిలిపోయింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, ఇప్పటికైనా ఈ విషయంలో పునరాలోచించి వీలైనంత త్వరగా సమస్య పరిష్కరించాలని కోరారు. తెలంగాణలో విద్యుత్‌ పంపిణీకి సంబంధించి ఆ రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ ఉత్పత్తి సంస్థకు రూ.6,112 కోట్ల బకాయిలు రావాల్సి ఉందన్నారు. రాష్ట్ర విభజన జరిగిన జూన్‌ 2, 2014 నుంచి జూన్‌ 10, 2017 వరకు ఏపీ విద్యుత్‌ ఉత్పత్తి సంస్థ (ఏపీ జెన్‌కో)కు ఆ మేరకు తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థలు (డిస్కమ్‌లు) బకాయిలు చెల్లించాల్సి ఉందని చెప్పారు.

తెలంగాణ బకాయిలు ఇవ్వటం లేదు

తెలంగాణ బకాయిలు ఇవ్వటం లేదు


కానీ ఇప్పటి వరకు తెలంగాణ డిస్కమ్‌లు ఆ మొత్తం చెల్లించలేదన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా హామీ, నిబంధనతోనే రాష్ట్ర విభజన జరిగింది. అయితే ఏళ్లు గడిచినా, ఎంతో కీలకమైనా ఆ హామీని మాత్రం ఇప్పటికీ నెరవేర్చలేదని చెప్పుకొచ్చారు. ఇక షెడ్యూల్‌ 9, 10 జాబితాలో ఉన్న సంస్థలకు సంబంధించి చట్టపరంగా ఇరు రాష్ట్రాల మధ్య ఆస్తుల పంపిణీ. వాటి విలువ దాదాపు రూ.1,42,601 కోట్లుగా అంచనా. అయితే ఆయా సంస్థలను విభజన చట్టంలో ప్రస్తావించకపోవడం వల్ల, ఆస్తుల పంపిణీ జరగకపోవడంతో ఆంధ్రప్రదేశ్‌కు చాలా నష్టం జరుగుతోందని వివరించారు.

కేంద్రం అత్యవసరంగా జోక్యం చేసుకోవాలి

కేంద్రం అత్యవసరంగా జోక్యం చేసుకోవాలి

అందువల్ల వీటన్నింటికి సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ ప్రయోజనాల దృష్ట్యా, కేంద్ర ప్రభుత్వ అత్యవసర జోక్యం తప్పనిసరని స్పష్టం చేసారు. ఈ ఆర్థిక సంవత్సరానికి (2021-22) సంబంధించి నికర రుణ పరిమితి (ఎన్‌బీసీ)ని రూ.42,472 కోట్లుగా నిర్థారించడం జరిగింది. అయితే గత రాష్ట్ర ప్రభుత్వ హయాంలో పరిమితికి మించి రుణాలు సేకరించారన్న కేంద్ర ఆర్థిక శాఖ, ఈ ఏడాది నిర్ధారించిన నికర రుణ పరిమితి (ఎన్‌బీసీ)లో రూ.19,923.24 కోట్లు సర్దుబాటు చేసే విధంగా రుణ పరిమితిలో ఆ మేరకు కోత విధించిందని షా కు నివేదించారు.

Recommended Video

    AP MLC Elections : అభ్యర్ధుల ఎంపిక పూర్తి .. కొత్తగా 14 మంది ఖరారు..! || Oneindia Telugu
    మా మొర కేంద్రం వినటం లేదు

    మా మొర కేంద్రం వినటం లేదు

    గత ప్రభుత్వం చేసిన అధిక రుణాలకు తమ బాధ్యత లేకపోయినప్పటికీ ఎన్‌బీసీలో కోత విధించడం సరి కాదని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా కేంద్ర ఆర్థిక శాఖ సమ్మతించకపోగా, నికర రుణ పరిమితిలో కోతను ఏకంగా మరో మూడేళ్లకు విస్తరించిందని చెప్పుకొచ్చారు. నిర్ణీత వ్యవధిలో రాష్ట్ర సమస్యలు పరిష్కారమయ్యేలా స్వీయ నేతృత్వంలో ఒక కమిటీ ఏర్పాటు చేయాలని కేంద్ర హోం మంత్రి జోక్యం చేసుకోవాలని సీఎం జగన్ కోరారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+