రేపు నైరుతి ఆగమనం, ఇటు వడగాల్పులు- ఏపీ జిల్లాలకు తాజా హెచ్చరిక..!!

తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకున్నాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. అదే విధంగా వర్షాలు కొనసాగుతున్నాయి. ఈ రోజు, రేపు తెలుగు రాష్ట్రా ల్లో వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఏపీలోని 144 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. పలు జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరిక చేసింది. కాగా, ఈ నెల 27న కేరళ తాకనున్న నైరుతి రుతుపవనాలు రేపు దక్షిణ అండమాన్ ను తాకనున్నాయి.

రుతుపవనాలు
నైరుతి రుతుపవనాలు ఈనెల 13వ తేదీన దక్షిణ అండమాన్‌ సముద్రం, నికోబార్‌ దీవులు, ఆగ్నే య బంగాళాఖాతంలో ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఆ తర్వాత 4-5 రోజుల్లో దక్షిణ అరేబియా సముద్రం, కొమరిన్‌ ప్రాంతం, దక్షిణ, మధ్య బంగాళాఖాతం, అండమాన్‌లో అన్ని ప్రాంతాలకు విస్తరించనున్నాయని తెలిపింది. మరోవైపు ఆదివారం రాష్ట్రంలో ఎండ తీవ్రత కొనసాగింది. కోస్తాలోని అనేక ప్రాంతాలు, రాయలసీమలో పలుచోట్ల వేడి వాతావరణం నెలకొంది. ఉత్తర కోస్తాలో పలుచోట్ల వడగాడ్పులు వీశాయి. కోస్తాలో అనేక చోట్ల ఆకాశం నిర్మలంగా ఉండడం, వాయవ్య భారతం నుంచి వీచిన పొడిగాలులతో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-4 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి.

southwest-monsoon-likely-to-advance-into-south-andaman-sea-by-may-13

రికార్డు ఉష్ణోగ్రతలు
కాగా, ఏపీలోని 144 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రకాశం జిల్లా పెదదోర్నాల, శ్రీకాకుళం జిల్లా జగ్గిలిబొంతులో 42.2, తిరుపతి జిల్లా ఓజిలి, అల్లూరి జిల్లా ఎర్రంపేటలో 41.8, ఎన్టీఆర్‌ జిల్లా పెనుగంచిప్రోలులో 41.6 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాయలసీమ, కోస్తాలో అక్కడక్కడా పిడుగులు, ఈదురుగాలులతో వర్షాలు కురిశాయి. ఇక.. ఈ రోజు (సోమవారం) 42-43.5 డిగ్రీల మధ్య గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లోని 29 మండలాల్లో తీవ్రంగా, శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, అనకాపల్లి, తూర్పుగోదావరి, కాకినాడ, కృష్ణా జిల్లాల్లోని మరో 41 మండలాల్లో వడగాడ్పులు ప్రభావం చేపే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

ఎండలు - వర్షాలు
అలాగే అనంతపురం, శ్రీసత్యసాయి, కడప జిల్లాల్లో చెదురుమదురుగా పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు, మిగిలిన జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. కోస్తాలో ఎండతీవ్రత కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సోమ, మంగళవారాల్లో కోస్తాలో పలుచోట్ల వడగాడ్పులు వీస్తాయని పేర్కొన్నారు. ఈ నెల 14వ తేదీ నుంచి రాయలసీమ, దక్షిణ కోస్తాలో వర్షాలు పెరుగుతాయని వెల్లడించారు. దీంతో, ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+