కుటుంబ సభ్యులకు అవకాశం ఇవ్వాలి, స్పీకర్ కీలక వ్యాఖ్యలు.!!
స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. కుటుంబ సభ్యులతో కలిసి అయ్యన్న తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. టీడీపీ ఆవిర్భావం నుంచి తాను పార్టీ కోసం పని చేసానని చెప్పుకొచ్చారు. వైసీపీ హయాంలో రాష్ట్రం నష్టపోయిందని వ్యాఖ్యానించారు. తన కుటుంబ సభ్యులకు ప్రజల కోసం.. పార్టీ కోసం సేవ చేసే అవకాశం కల్పించాలని పేర్కొన్నారు. ప్రస్తుతం రాజ్యసభ సీట్ల కేటాయింపు వేళ అయ్యన్న వ్యాఖ్యలు ఆసక్తి కరంగా మారాయి.
శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి కి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారి దర్శనానంతరం ఆలయ అర్చకులు ఆయనకి వేద ఆశీర్వచనం అందించి, స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం అయ్యన్న పాత్రుడు కీలక వ్యాఖ్యలు చేసారు తన పెళ్లి రోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నానని తెలిపారు. స్వామివారి ఆశీస్సులు పొందడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. జీవితంలో ముఖ్యమైన రోజున శ్రీవారి సన్నిధిలో గడపడం ఆధ్యాత్మికంగా ఎంతో సంతృప్తినిచ్చిందని పేర్కొన్నారు. రాష్ట్ర రాజకీయాలు, తన భవిష్యత్తు కార్యాచరణపై అయ్యన్నపాత్రుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ మోహన్ రెడ్డి హయాంలో ఏపీ తీవ్రంగా నష్టపోయిందని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రం మళ్లీ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని చెప్పారు.

రాజ్యసభ సీట్ల కోసం పెరుగుతున్న పోటీ
కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు వేగంగా అమలవుతున్నాయని పేర్కొన్నారు. తన వయస్సు పెరుగుతున్న నేపథ్యంలో, భవిష్యత్తులో తన కుటుంబ సభ్యులకు కూడా రాజకీయంగా, పార్టీలో సేవ చేసే అవకాశం కల్పించాలని శ్రీవారిని ప్రార్థించినట్లు తెలిపారు. ప్రజాసేవలో తన కుటుంబం కూడా భాగస్వామ్యం కావాలని అయ్యన్నపాత్రుడు ఆకాంక్షించారు. త్వరలో రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులను ఎంపిక చేస్తున్న సమయంలో అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యలకు రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. టీడీపీలో రాజ్యసభ ఆశావహుల మధ్య అయ్యన్న పాత్రుడి వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఇప్పటికే కూటమి పార్టీలకు దక్కే నాలుగు సీట్ల పైన మూడు పార్టీల్లోనూ ఆశావాహుల సంఖ్య ఎక్కువగా ఉంది. దీంతో.. టీడీపీకి ఎన్ని సీట్లు దక్కుతాయి.. చివరకు ఎవరకు అవకాశం ఇస్తారనేది ఉత్కంఠగా మారుతోంది.













Click it and Unblock the Notifications