వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హోదాతో ఒరిగేదేమి లేదు.. మంత్రివర్గంలో ఏ బాధ్యతకైనా రెడీ : లోకేష్

|
Google Oneindia TeluguNews

గుంటూరు (నగరంపాలెం) : ప్రత్యేక హోదా మీద ఏపీ ప్రజల్లో బలమైన సెంటిమెంట్ నాటుకుపోయింది. హోదా గురించి ఎవరూ మాట్లాడినా..! రాజకీయాలకు అతీతంగా స్పందించాల్సిన పరిస్థితి. అధికారంలో ఉన్నారు కాబట్టి.. టీడీపీ బీజేపీలే హోదా భారాన్ని మోయాలి. ఆ విశ్వాసంతోనే ప్రజలు కూడా టీడీపీకి అధికారాలు పగ్గాలు అప్పజెప్పారు.

ఈ నేపథ్యంలో..హోదా వచ్చినంత మాత్రాన ఒరిగేదేమి లేదని సీఎం చంద్రబాబు పలుమార్లు చేసిన వ్యాఖ్యలు విపక్షాల చేత విమర్శలపాలయ్యాయి. ఇకపోతే ఇప్పుడు చంద్రబాబు తనయుడు, పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ కూడా.. హోదా వల్ల ఒరిగేదేమి ఉండదనిని పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది.

కృష్ణా పుష్కరాలను పురస్కరించుకుని.. గుంటూరు టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో ఎన్టీఆర్‌ ట్రస్ట్ భవన్‌ తరఫున కృష్ణా యాప్‌ను ఆవిష్క‌రించిన లోకేష్ ఈ వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు మంత్రివర్గంలో ఏ బాధ్యతకైనా తాను రెడీ అంటున్న లోకేష్ కామెంట్స్.. స్లైడ్స్ లో..

హోదాతో వాళ్లకు ఒరిగిందేమి లేదు

హోదాతో వాళ్లకు ఒరిగిందేమి లేదు


ప్రత్యేక హోదా వల్ల ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఐదు వేల ఉద్యోగాలు కూడా రాలేదని, హోదా వల్ల అక్కడ ఒరిగేందేమి లేదని అన్నారు లోకేష్.

బయటకొస్తే.. జగన్, కేసీఆర్ దూరుతారు

బయటకొస్తే.. జగన్, కేసీఆర్ దూరుతారు


హోదా విషయంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడానికి రాజీ లేని పోరాటం చేస్తామని చెప్పారు లోకేష్. హోదా ఉన్నా లేకున్నా.. రాష్ట్రం కోసం కష్టపడి పనిచేస్తామన్న లోకేష్.. కేంద్రం నుండి బయటకొస్తే ఎన్డీయేతో జతకలవడానికి జగన్, కేసీఆర్ సిద్దంగా ఉన్నారని ఆరోపించారు.

అవినీతి అవాస్తవం

అవినీతి అవాస్తవం


కృష్ణ‌ పుష్కర పనుల్లో అవినీతి చోటు చేసుకుందన్న ఆరోపణలను లోకేష్ ఖండించారు. ఇంతవరకు కాంట్రాక్టర్లకు నిధులు ఇవ్వలేదని, నాణ్యతను పరిశీలించాకే నిధులు మంజూరు చేస్తామని ప్రకటించారు.

కృష్ణా యాప్

కృష్ణా యాప్


కృష్ణ పుష్కర పనుల సందర్బంగా.. కృష్ణా యాప్‌ ను ప్రారంభించిన లోకేష్.. గత గోదావరి పుష్కరాలకు మూడు కోట్ల మంది వచ్చారని, కృష్ణ పుష్కరాలను విజయవంతంగా నిర్వహిస్తామని తెలిపారు.

మంత్రివర్గంలో ఓకె

మంత్రివర్గంలో ఓకె


కృష్ణ పుష్కరాలకు సంబంధించి 95 పనులు శాతం పనులు పూర్తయ్యాయని, కేవలం 5 శాతం పనులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయన్నారు. మంత్రివర్గంలో ఏ బాధ్యత అప్పగించినా చిత్తశుద్దితో పనిచేస్తానన్నారు.

English summary
TDP Leader lokesh made some interesting comments over special status issue in gunturu meet. He said only status is not enough for ap
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X