వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సున్నితమైంది, రాజీనామా చేస్తా: హోదాపై మురళీ మోహన్, గోపీకృష్ణ కుటుంబానికి మంత్రి పరామర్శ

By Srinivas
|
Google Oneindia TeluguNews

రాజమండ్రి/శ్రీకాకుళం: ప్రత్యేక హోదా కోసం అవసరమైతే తాము రాజీనామాలు చేసేందుకు కూడా సిద్ధమని, అయితే ప్రస్తుత పరిస్థితుల్లో బయటకు రాలేమని నటుడు, రాజమండ్రి పార్లమెంటు పార్లమెంటు సభ్యుడు మురళీ మోహన్ ఆదివారం అన్నారు.

ఇప్పటికిప్పుడు తాము రాజీనామా చేస్తే ప్రత్యేక హోదా వస్తుందంటే అందుకు కూడా తాము సిద్ధమని అభిప్రాయపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశం చాలా సున్నితమైనదన్నారు. తమ రాజీనామాలతో కేంద్రం ప్రత్యేక హోదా ఇస్తుందంటే ఇప్పుడే చెప్పలేమన్నారు.

రాజమండ్రికి ప్రాజెక్టుల కోసం కేంద్రంతో సంప్రదింపులు చేస్తున్నామని చెప్పారు. అయితే స్థలాభావం సమస్యగా ఉందన్నారు. అన్ని వర్గాల సహకారంతోనే గోదావరి పుష్కరాల విజయవంతం అయ్యాయని చెప్పారు. విజయంలో అందరి పాత్ర ఉందన్నారు.

Special Status is very sensitive issue: Murali Mohan

గోపీకృష్ణ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి

లిబియాలో ఐసిస్ ఉగ్రవాదులు అపహరించిన గోపీకృష్ణ కుటుంబాన్ని మంత్రి అచ్చెన్నాయుడు ఆదివారం పరామర్శించారు. గోపీకృష్ణ విడుదలకు భారత ప్రభుత్వం ద్వారా ఏపీ సర్కార్ కృషి చేస్తోందన్నారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు.

కాగా, గత బుధవారం లిబియాలోని ట్రిపోలీలో అధ్యాపకులుగా పని చేస్తున్న నలుగురిని ఐసిస్ ఉగ్రవాదులు అపహరించిన విషయం తెలిసిందే. కిడ్నాపైన వారిలో ఇద్దరు కర్నాటకవాసులు, ఇద్దరు తెలుగువారు బలరాం (కరీంనగర్), గోపీకృష్ణ (శ్రీకాకుళం) ఉన్నారు.

ఉగ్రవాదులు కర్నాటకవాసులిద్దర్నీ చెర నుంచి విడిపించారు. తెలుగు వారిని కూడా విడిచిపెట్టినట్లు వార్తలు వచ్చాయి. అయితే, ఇంకా విడవలేదు. దీంతో ఆ కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. గోపీకృష్ణ, బలరాంలను విడిపించేందుకు కేంద్ర ప్రభుత్వం లిబియా, ఇతరులతో చర్చలు జరుపుతోంది.

English summary
Rajahmundry MP Murali Mohan on Sunday said that Special Status is very sensitive issue
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X