అదొక్కటే మనకు చిక్కు: ఏపీ బీజేపీ, ప్రత్యేక హోదాపై తేల్చేద్దాం

విజయవాడ: ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం తీరు రాష్ట్ర ప్రజల దృష్టిలో తమను ఇబ్బందికి గురి చేస్తోందని, హోదా విషయం పై తేల్చి చెప్పక పోవడం పార్టీకి నష్టం చేస్తోందని ఏపీ బీజేపీ నేతలు సమావేశంలో బుధవారం నాడు అభిప్రాయపడ్డారు.

ఏపీ బీజేపీ జిల్లా ఇంఛార్జులు, ప్రముఖులు బుధవారం రాజధానిలో భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వారు ప్రత్యేక హోదా, రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన, ఇస్తున్న నిధుల అంశం పైన సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా హోదా తమను చిక్కుల్లో పెడుతోందని పలువురు ఆవేదన వ్యక్తం చేశారని తెలుస్తోంది.

అలాగే, ఏపీకి కేంద్రం ఇచ్చిన నిధులు, సహాయం పైన నెగిటివ్ ప్రచారం జరుగుతోందని పలువురు అభిప్రాయపడ్డారు. ప్రధాని మోడీ రెండేళ్ల పాలన నేపథ్యంలో నిర్వహించనున్న వికాస్ పర్వ్ వేదికగా ఏపీకి కేంద్రం సాయాన్ని ప్రజల దృష్టికి తీసుకు వెళ్లాలని నిర్ణయించారు.

 Special tag irks BJP leaders

చట్టంలో లేనివి సాధ్యం కాదని కూడా చెప్పాలని నిర్ణయించారు. చట్టంలో పెట్టిన వాటన్నింటినీ అమలు చేస్తామని బీజేపీ నేతలు ఇప్పటికే చెబుతున్నారు. ఇదే విషయాన్ని ప్రజలకు వెల్లడించనున్నారు. అలాగే, చట్టంలో లేనివి సాధ్యం కాదని చెప్పనున్నారు. తద్వారా హోదా సాధ్యం కాదని ప్రజలకు చెప్పనున్నారని తెలుస్తోంది.

టిడిపి నేతలు బీజేపీ పైన విరుచుకు పడుతున్న అంశం కూడా చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. మిత్రపక్షం అలా మెసలడం లేదని వారు అభిప్రాయపడ్డారని తెలుస్తోంది. తమను దోషిగా నిలబెడితే.. కేంద్రం ఇచ్చిన నిధుల లెక్కలను చెప్పాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని నిర్ణయించారని తెలుస్తోంది. ఏపీ కేంద్రానికి ప్రత్యేక రాష్ట్రమని వారు చెప్పనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+