సికింద్రాబాద్, వరంగల్, ఖమ్మం, ఏలూరు, విశాఖపట్నం వారికి ముఖ్య గమనిక
సికింద్రాబాద్ నుంచి విశాఖకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైలును నడుపుతోంది. వరంగల్, ఖమ్మం, ఏలూరు, అన్నవరం, అనకాపల్లి మీదుగా నడుస్తుంది. ఈనెల 18వ తేదీన మాత్రమే ఈ రైలు అందుబాటులో ఉండనుంది. No.07055 రైలు సికింద్రాబాద్ లో రాత్రి 9.00 గంటలకు బయలుదేరి తర్వాతరోజు ఉదయం 9.45 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.
జనగాం, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, రాయనపాడు, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, తుని, అనకాపల్లి, దువ్వాడ స్టేషన్లలో ఆగుతుంది. ఈ అవకాశాన్ని ప్రయాణికులు ఉపయోగించుకోవాలని అధికారులు కోరారు.

ఐఆర్‌సీటీసీకి చెందిన రైల్ కనెక్ట్ మొబైల్ యాప్ పేరుతో సైబర్ నేరగాళ్లు హానికర లింకులు పంపిస్తున్నారని సంస్థ వెల్లడించింది. ఈ లింకుపై క్లిక్ చేయగానే ఒరిజినల్ యాప్ ఉన్నట్లుగా చూపిస్తుందని, ఎలాంటి అనుమానం రాకుండా దాన్ని డిజైన్ చేశారంది.లాగిన్ క్రెడెన్షియల్స్ వంటివాటిని ప్రజలు ఎంటర్ చేసిన తర్వాత ఈ డేటాను దుర్వినియోగం చేస్తున్నారని, ఆర్థిక మోసాలకు పాల్పడుతున్నారని, ప్రయాణికులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఐఆర్ సీటీసీ కోరుతోంది.
ఆండ్రాయిడ్ యూజర్లు ప్లే స్టోర్, ఐఫోన్ యూజర్లు యాపిల్ యాప్ స్టోర్ నుంచి తప్ప ఇతర సోర్సులను ఆశ్రయించవద్దని సంస్థ హెచ్చరించింది. కస్టమర్ కేర్ నెంబరు కోసం గూగుల్ లో సెర్చ్ చేయవద్దని, ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్ https://irctc.co.inని సందర్శించాలని సూచించింది. ఇంటర్నెట్ బ్రౌజింగ్ చేసే సమయంలో అప్రమత్తత అవసరమని, అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దని, ప్లేస్టోర్, యాప్ స్టోర్ కాకుండా ఇతర సోర్సుల నుంచి ఏవీ డౌన్ లోడ్ చేసుకోవద్దని కోరింది.












Click it and Unblock the Notifications